Telugu Global
Health & Life Style

కరోనాతో మల్టీ ఆర్గాన్స్‌ ఎలా ఫెయిల్ అవుతాయి?

కరోనా వైరస్ చాలామందిలో వచ్చిపోయినట్టు కూడా తెలియదు. కొంతమందిని మాత్రం ప్రాణం తీసే వరకూ వదలడం లేదు. అయితే, కరోనా వచ్చి చనిపోయినవాళ్ల రిపోర్ట్స్‌ని పరిశీలిస్తే కామన్‌గా కనిపించే ప్రాబ్లమ్‌.. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్‌‌! ‘ కరోనా పేషెంట్‌లో ఎందుకిలా అవయవాలు ఫెయిల్‌ అవుతున్నాయి?’ అనే అంశం మీద అమెరికాలోని ‘యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా’ సైంటిస్టులు రీసెర్చ్ చేశారు. వైరస్‌ అవయవాల పనితీరుని ఎలా నాశనం చేస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేశారు. దీనికోసం ముందుగా ల్యాబ్‌లో ఎలుకను […]

కరోనాతో మల్టీ ఆర్గాన్స్‌ ఎలా ఫెయిల్ అవుతాయి?
X

కరోనా వైరస్ చాలామందిలో వచ్చిపోయినట్టు కూడా తెలియదు. కొంతమందిని మాత్రం ప్రాణం తీసే వరకూ వదలడం లేదు. అయితే, కరోనా వచ్చి చనిపోయినవాళ్ల రిపోర్ట్స్‌ని పరిశీలిస్తే కామన్‌గా కనిపించే ప్రాబ్లమ్‌.. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్‌‌!

‘ కరోనా పేషెంట్‌లో ఎందుకిలా అవయవాలు ఫెయిల్‌ అవుతున్నాయి?’ అనే అంశం మీద అమెరికాలోని ‘యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా’ సైంటిస్టులు రీసెర్చ్ చేశారు. వైరస్‌ అవయవాల పనితీరుని ఎలా నాశనం చేస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేశారు. దీనికోసం ముందుగా ల్యాబ్‌లో ఎలుకను హ్యూమన్ మోడల్‌గా తీసుకొని చేసిన స్టడీలో ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి.

ఎలుకలే ఎందుకంటే…

ఎలుకలు చూడటానికి మనుషుల్లాగా ఉండవు. కానీ, బయాలాజికల్‌గా మాత్రం మనకూ, ఎలుకలకూ చాలా దగ్గరి సంబంధం ఉంది. దాదాపు మనలో ఉండే ప్రతి కణం ఎలుకల్లోనూ ఉంటుంది. గుండె, మెదడు, ఊపిరితిత్తులు ఇలా ప్రతి ఒక్క అవయవం అచ్చంగా మనిషికి ఉన్నట్టే ఉంటాయి. జీర్ణవ్యవస్థ, నాడీ వ్యవస్థలతో పాటు హార్మోన్లు కూడా అచ్చంగా మనిషిలో ఎలాగైతే పని చేస్తాయో అలాగే చేస్తుంటాయి.

అందుకే, మనిషికి ప్రత్యామ్నాయంగా ఎలుకను ‘ది బెస్ట్‌ హ్యుమన్‌ బెస్ట్ మోడల్‌’ గా పరిగణిస్తారు. కాబట్టి, సైంటిస్టులు మనుషులకు సంబంధించి ఏ బయో మెడికల్ రీసెర్చ్ చేసినా.. ముందుగా ఎలుకల మీదే చేస్తారు. తర్వాతే మనుషులను ఇన్వాల్వ్ చేస్తారు.

వైరస్ పంపించి…

ముందుగా ఎలుకలకు ముక్కు ద్వారా కరోనా వైరస్‌ని పంపించారు. అది అక్కడి నుంచి ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించింది. ఇలా చేసినప్పుడు కేవలం ఊపిరితిత్తుల వరకే ఇన్‌ఫెక్షన్ సోకింది. కానీ, ఇతర అవయవాలకు అది పాకలేదు. అంటే వైరస్ ఊపిరితిత్తులకే పరిమితమై.. పదిహేను రోజుల్లోనే రికవరీ కూడా అయ్యాయి.

దాంతో నేరుగా రక్తంలోకి కరోనా వైరస్‌ని ఎక్కించామని ఈ స్టడీని లీడ్ చేసిన కార్డియాలిజిస్ట్‌ డాక్టర్‌‌ అర్జున్‌ డేబ్‌ చెప్పాడు. ఎప్పుడైతే వైరస్ రక్తంలోకి ప్రవేశించిందో.. అప్పటి నుంచి గుండె కొట్టుకోవడం, బీపీ లెవెల్స్‌లో తేడా కనిపించాయి. ఇమ్యూనిటీ సిస్టమ్ బలహీనంగా మారడం మొదలైంది. నెమ్మదిగా ఆహారం తీసుకోవడం తగ్గించాయి. దాంతో ఇరవైఐదు శాతం బరువు కోల్పోయాయి. ఆ తర్వాత అవయవాలు ఒక్కొక్కటిగా ఫెయిల్‌ అయ్యాయి. తర్వాత ఆ ఎలుకలు చనిపోయాయి.

‘కోవిడ్–19 పేషెంట్స్‌లో ఊపిరితిత్తులకు కాకుండా ఇతర అవయవాలకు ఇన్‌ఫెక్షన్ సోకినవాళ్లకు రిస్క్‌ ఎక్కువ. వీళ్లలో చాలామంది చనిపోయే అవకాశమే ఎక్కువ. అయితే, మనుషుల్లో ఈ వైరస్ రక్తంలోకి ఎలా చేరుతుందో అనే విషయాన్ని ఇప్పటికీ తెలుసుకోలేపోయాం. దీని గురించి తెలుసుకోవడానికి మా స్టడీని కొనసాగిస్తున్నాం’ అని డాక్టర్ అర్జున్ చెప్పాడు.

First Published:  11 Dec 2020 5:34 AM GMT
Next Story