Telugu Global
Health & Life Style

వంటింట్లో... గుండెకు ఔషధాలు!

గత ఇరవై ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా గుండెవ్యాధులు అత్యంత ఎక్కువ మరణాలకు కారణమవుతున్నాయి. ఇప్పుడు మరింత ఎక్కువ మంది ఈ వ్యాధుల బారిన పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తన ఇటీవలి నివేదికలో పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా 16శాతం మరణాలు గుండె వ్యాధుల కారణంగానే సంభవిస్తున్నాయి.  ఆహారం, వ్యాయామం, జీవనశైలి… ఈ మూడు గుండెవ్యాధుల విషయంలో ఎక్కువ ప్రభావాన్ని చూపుతున్నాయి. ఈ విషయాల్లో మనం చేస్తున్న పొరబాట్లు, తప్పుల వలన మరింత ఎక్కువ మూల్యాన్ని చెల్లించాల్సివస్తోంది. గుండె […]

వంటింట్లో... గుండెకు ఔషధాలు!
X

గత ఇరవై ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా గుండెవ్యాధులు అత్యంత ఎక్కువ మరణాలకు కారణమవుతున్నాయి. ఇప్పుడు మరింత ఎక్కువ మంది ఈ వ్యాధుల బారిన పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తన ఇటీవలి నివేదికలో పేర్కొంది.

ప్రపంచవ్యాప్తంగా 16శాతం మరణాలు గుండె వ్యాధుల కారణంగానే సంభవిస్తున్నాయి. ఆహారం, వ్యాయామం, జీవనశైలి… ఈ మూడు గుండెవ్యాధుల విషయంలో ఎక్కువ ప్రభావాన్ని చూపుతున్నాయి. ఈ విషయాల్లో మనం చేస్తున్న పొరబాట్లు, తప్పుల వలన మరింత ఎక్కువ మూల్యాన్ని చెల్లించాల్సివస్తోంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుకునే మార్గాలు అనేకం మన చేతుల్లోనే ఉన్నాయి. ముఖ్యంగా మన వంటింట్లో కూడా గుండెకు మేలు చేసే అద్భుతమైన ఔషధాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం…

దాల్చిన చెక్క… ఇది మన గుండెకు అనేక విధాలుగా మేలు చేస్తుంది. ప్రతి రోజు కొంత మోతాదులో దాల్చిన చెక్కని తీసుకుంటూ ఉంటే కొలెస్ట్రాల్ తగ్గుతుందని పలు అధ్యయనాల్లో తేలింది. చెడు కొలెస్ట్రాల్, హానికరమైన కొవ్వు ట్రైగ్లిజరైడ్స్ ని సైతం దాల్చిన చెక్క తగ్గిస్తుంది. రక్తంలో షుగర్ స్థాయిని తగ్గించి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

వెల్లుల్లి… దీనిని తీసుకోవటం వలన రక్తపోటు ఆరోగ్యకరంగా ఉంటుంది. కొలెస్ట్రాల్ స్థాయిని సైతం ఆరోగ్యకర స్థాయిలో ఉంచుతుంది. ఇది రక్తనాళాలను మృదువుగా మార్చి రక్త ప్రసారం బాగా జరిగేలా చేస్తుంది. వెల్లుల్లిని నేరుగా ఆహారం ద్వారా తాజాగా తీసుకోవటమే మంచిది. అయితే దీనిని ఎక్కువగా వాడాలని అనుకునేవారు తాము వాడుతున్న మందుల్లో రక్తాన్ని పలుచనచేసేవి లేవని నిర్దారించుకోవాలి. వెల్లుల్లికి రక్తస్రావాన్ని పెంచే రిస్క్ ఉంది. వైద్యులను సంప్రదించిన తరువాతే దీనిని వాడటం మంచిది.

అల్లం… అధిక రక్తపోటుని తగ్గించడంలో అల్లం చాలా బాగా పనిచేస్తుందని అనేక అధ్యయనాల్లో తేలింది.

గ్రీన్ టీ…ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. రోజుకి అయిదు లేదా ఆరు కప్పుల గ్రీన్ టీని తాగటం వలన మంచి ప్రయోజనాలు పొందవచ్చని తెలుస్తోంది. అయితే అందులో పంచదార పాలు లాంటివి కలపకుండా తాగాలి.

First Published:  11 Dec 2020 8:10 PM GMT
Next Story