Telugu Global
National

రేవంత్‌కే పీసీసీ పదవి! ఢిల్లీ నుంచి త్వరలో ప్రకటన !

తెలంగాణ పీసీసీ పదవి మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌ రెడ్డికి దాదాపు ఖరారు అయింది. ఢిల్లీ అధిష్టానం చివరి నిమిషంలో ఝలక్‌లు ఇవ్వకపోతే రేవంత్‌ను పదవి వరించనుంది. తెలంగాణ పీసీసీ పదవి కోసం నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు తరపున కొందరు సీనియర్లు లాబీయింగ్‌ మొదలుపెట్టారు. రేవంత్‌కు కాకుండా వీరిద్దరిలో ఒకరికి పదవి ఇవ్వాలని తెలంగాణ ఇంచార్జ్‌ ఠాకూర్‌ ముందు ప్రతిపాదన పెట్టారు. సీనియర్ల వాదన విన్న ఠాకూర్‌…. మరికొందరి నుంచి కూడా […]

రేవంత్‌కే పీసీసీ పదవి! ఢిల్లీ నుంచి త్వరలో ప్రకటన !
X

తెలంగాణ పీసీసీ పదవి మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌ రెడ్డికి దాదాపు ఖరారు అయింది. ఢిల్లీ అధిష్టానం చివరి నిమిషంలో ఝలక్‌లు ఇవ్వకపోతే రేవంత్‌ను పదవి వరించనుంది.

తెలంగాణ పీసీసీ పదవి కోసం నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు తరపున కొందరు సీనియర్లు లాబీయింగ్‌ మొదలుపెట్టారు. రేవంత్‌కు కాకుండా వీరిద్దరిలో ఒకరికి పదవి ఇవ్వాలని తెలంగాణ ఇంచార్జ్‌ ఠాకూర్‌ ముందు ప్రతిపాదన పెట్టారు.

సీనియర్ల వాదన విన్న ఠాకూర్‌…. మరికొందరి నుంచి కూడా అభిప్రాయసేకరణ జరిపారు. సీనియర్‌ నేత జానారెడ్డికి గానీ రేవంత్‌కు ఇవ్వాలని సూచించినట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి కూడా రేవంత్‌కు ఓటు వేశారట. గ్రౌండ్‌ లెవల్‌లో కార్యకర్తల నుంచి వస్తున్న స్పందన చూసిన తర్వాత రేవంత్‌కు పీసీసీ పదవి ఇవ్వడంలో తప్పేమీ లేదని వీళ్లు అన్నారట.

ఠాకూర్‌ సీనియర్‌ నేతల నుంచి ఫీడ్‌ బ్యాక్‌ సేకరించిన తర్వాత డీసీసీ అధ్యక్షుల నుంచి అభిప్రాయ సేకరణ జరిపారట. 31 మంది డీసీసీ అధ్యక్షుల్లో దాదాపు 23 మంది రేవంత్‌కు ఓటేశారట. రేవంత్‌కు పీసీసీ ఇవ్వకపోతే పార్టీకి రాజీనామా చేస్తామని 13 మంది డైరెక్టుగా చెప్పేశారట. ఆ తర్వాత మండలాధ్యక్షులకు ఫోన్లు చేశారట. మొత్తానికి గ్రౌండ్‌ లెవల్లో కార్యకర్తల నుంచి రేవంత్‌కు పూర్తిగా మద్దతు వస్తుందట. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్‌ను బతికించేంది రేవంత్‌ ఒక్కడే అనేది కార్యకర్తల నమ్మకం.

పార్టీలో అన్ని విభాగాల నుంచి అభిప్రాయాలు సేకరించిన తర్వాత కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి ఇంచార్జ్‌ మాణిక్యం ఠాకూర్‌ నివేదిక అందించనున్నారు. ఈ రిపోర్టు ఆధారంగా కొత్త పీసీసీ అధ్యక్షుడి నియామకం ఉంటుందని తెలుస్తోంది.

First Published:  11 Dec 2020 8:01 PM GMT
Next Story