Telugu Global
Health & Life Style

వ్యాక్సిన్‌ రాకతో మాస్క్‌కు గుడ్‌బై చెప్పెయొచ్చా?

2021 కి వ్యాక్సిన్ వచ్చేస్తుంది అన్న ఆశతో ఎదురుచూస్తున్నారంతా.. ఒకవేళ అంతా బాగానే ఉండి, వ్యాక్సిన్ వచ్చేస్తే ఇక గండం గట్టెక్కినట్టేనా.. మాస్క్ తీసి పక్కన పడేయొచ్చా.. అంటే కుదరదనే అంటున్నారు ఎక్స్‌పర్ట్స్. కోవిడ్ వ్యాక్సిన్ ప్రతిఒక్కరికీ అందడానికి బాగానే టైం పట్టొచ్చు. వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్లు కూడా తమ ద్వారా వైరస్‌ను వ్యాప్తి చేసే అవకాశం లేకపోలేదు. అందుకే వ్యాక్సిన్ వచ్చిన తర్వాత కూడా ఇవే జాగ్రత్తలతో ఉండాలంటోంది ‘సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్’. వ్యాక్సిన్ […]

వ్యాక్సిన్‌ రాకతో మాస్క్‌కు గుడ్‌బై చెప్పెయొచ్చా?
X

2021 కి వ్యాక్సిన్ వచ్చేస్తుంది అన్న ఆశతో ఎదురుచూస్తున్నారంతా.. ఒకవేళ అంతా బాగానే ఉండి, వ్యాక్సిన్ వచ్చేస్తే ఇక గండం గట్టెక్కినట్టేనా.. మాస్క్ తీసి పక్కన పడేయొచ్చా.. అంటే కుదరదనే అంటున్నారు ఎక్స్‌పర్ట్స్. కోవిడ్ వ్యాక్సిన్ ప్రతిఒక్కరికీ అందడానికి బాగానే టైం పట్టొచ్చు.

వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్లు కూడా తమ ద్వారా వైరస్‌ను వ్యాప్తి చేసే అవకాశం లేకపోలేదు. అందుకే వ్యాక్సిన్ వచ్చిన తర్వాత కూడా ఇవే జాగ్రత్తలతో ఉండాలంటోంది ‘సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్’.

వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎంత పెద్ద మొత్తంలో డిస్ట్రి్బ్యూట్ చేసినా.. ప్రతి సామాన్యుడి వరకూ చేరేసరికి చాలా టైం పడుతుంది. ఈ లోపే అంతా అయిపోయిందనుకుని నార్మల్‌గా ఉంటే కుదరదని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నారు.

పూర్తిగా పనిచేయదు

గుర్తుంచుకోవాల్సిన మరో విషయం ఏంటంటే.. వ్యాక్సిన్ ఎఫీషియన్సీ 90 నుంచి 95 శాతం మాత్రమే ఉంటుదట. అంటే వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత కూడా ఐదు నుంచి పది శాతం వైరస్ బారిన పడే అవకాశం లేకపోలేదు. పైగా వ్యాక్సిన్ ఎఫెక్టివ్‌గా పని చేయడానికి నెల రోజులు పడుతుంది. అందుకే పూర్తి సేఫ్‌గా ఉండాలంటే వ్యాక్సిన్ వచ్చిన తర్వాత కూడా జాగ్రత్తలు పాటించడం మస్ట్.

ఇంకా రాలేదు

అన్నింటికంటే ముఖ్యమైన విషయమేంటంటే వ్యాక్సిన్ ఇప్పటికీ ఎర్లీ స్టేజ్‌లోనే ఉంది. పూర్తిగా అందుబాటులోకి రావడానికి ఇంకా టైం పట్టొచ్చు. 2021 రాకతో అంతా మారిపోతుందనుకుంటే కుదరదు. అప్పటివరకూ ఇప్పుడు పాటిస్తున్న బేసిక్ ప్రికాషన్స్‌తో సరిపెట్టుకోవాలి. మరీ ముఖ్యంగా వయసుపైబడిన, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడేవాళ్లు ఇంకొన్ని రోజులు మరింత జాగ్రత్తగా ఉండాలి. కొన్ని అంచనాల ప్రకారం వ్యాక్సిన్ వచ్చిన తర్వాత కూడా వైరస్ పూర్తిగా మాయమయ్యే అవకాశం లేదని తెలుస్తుంది.

అతిగా ఆశలొద్దు

వ్యాక్సిన్.. వైరస్‌ను పూర్తిగా మాయం చేయదు. అది మన శరీరంలో యాంటీ బాడీస్ డెవలప్ అయ్యి, ఇమ్యూనిటీ సిస్టమ్ మెరుగుపడడానికి హెల్ప్ చేస్తుంది. దీంతో పాటు వైరస్‌ను తట్టుకోడానికి ఎవరికి ఎంత ఇమ్యూనిటీ సరిపోతుందో చెప్పలేమంటున్నారు డాక్టర్లు. దానికోసం కొంత మందికి రెండు డోస్‌లు కూడా అవసరమవ్వొచ్చంటున్నారు. అందుకే వ్యాక్సిన్ మీద అతిగా ఆశలు పెట్టుకుని సేఫ్టీ మెజర్స్‌ను పక్కకు పెట్టొద్దని సూచిస్తున్నారు.

ఇకపోతే.. వైరస్‌కైతే వ్యాక్సిన్ వస్తుంది కానీ ప్యాండెమిక్‌తో ఇప్పటికే స్ట్రెస్ యాంగ్జైటీ లాంటి మానసిక సమస్యలతో బాధ పడుతున్నవారికి ఎలాంటి వ్యాక్సిన్ పని చేయదు. కాబట్టి సరైన జాగ్రత్తలు పాటిస్తూ సేఫ్‌గా ఉంటే అన్ని సర్దుకునే రోజులు ఎంతో దూరంలో లేవు.

First Published:  19 Dec 2020 10:05 AM GMT
Next Story