Telugu Global
National

బీజేపీ... బెంగాల్‌ ప్లాన్ నే తెలంగాణలోనూ‌ అమలు చేయబోతోందా?

పశ్చిమబెంగాల్‌లో రాజకీయ శూన్యత ఉంది. టీఎంసీని ఎదుర్కొనే పరిస్థితి లెఫ్ట్‌ పార్టీలకు లేకుండా పోయింది. నాయకత్వం లేకపోవడంతో వామపక్షాలు వీక్ అయిపోయాయి. ఇదే స్థానంలో ఇప్పుడు బీజేపీ ఎదగాలని ప్లాన్ చేస్తోంది. టీఎంసీతో సై అంటే సై అంటోంది. పశ్చిమబెంగాల్‌లో ఈ సారి జెండా ఎగురవేయాలని ప్లాన్‌ చేస్తున్న బీజేపీ…ఇప్పుడు టీఎంసీ నేతలపై కన్నేసింది. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ మమతా బెనర్జీకి వరుస షాక్‌లు ఇస్తోంది. రెండు రోజుల వ్యవధిలోనే ముగ్గురు ఎమ్మెల్యేలు టీఎంసీకి […]

బీజేపీ... బెంగాల్‌ ప్లాన్ నే తెలంగాణలోనూ‌ అమలు చేయబోతోందా?
X

పశ్చిమబెంగాల్‌లో రాజకీయ శూన్యత ఉంది. టీఎంసీని ఎదుర్కొనే పరిస్థితి లెఫ్ట్‌ పార్టీలకు లేకుండా పోయింది. నాయకత్వం లేకపోవడంతో వామపక్షాలు వీక్ అయిపోయాయి. ఇదే స్థానంలో ఇప్పుడు బీజేపీ ఎదగాలని ప్లాన్ చేస్తోంది. టీఎంసీతో సై అంటే సై అంటోంది.

పశ్చిమబెంగాల్‌లో ఈ సారి జెండా ఎగురవేయాలని ప్లాన్‌ చేస్తున్న బీజేపీ…ఇప్పుడు టీఎంసీ నేతలపై కన్నేసింది. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ మమతా బెనర్జీకి వరుస షాక్‌లు ఇస్తోంది.

రెండు రోజుల వ్యవధిలోనే ముగ్గురు ఎమ్మెల్యేలు టీఎంసీకి గుడ్‌బై చెప్పారు. ఎమ్మెల్యేలు సువేంద్‌, జితేంద్ర తివారీ టీఎంసీకి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే పదవులకు గుడ్‌బై చెప్పారు. తాజాగా బరాక్‌పోర్‌ ఎమ్మెల్యే శీల్‌ భద్ర దత్తా కూడా మమతా పార్టీని వీడారు. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరుతారని తెలుస్తోంది. మొత్తానికి అసెంబ్లీ ఎన్నికల వేళ మమతా బెనర్జీ టార్గెట్‌గా బీజేపీ వ్యూహాలకు పదును పెడుతోంది.

సేమ్‌ బెంగాల్‌ ప్లాన్‌ను తెలంగాణలో కూడా అమలు చేసేందుకు కమలదళం వ్యూహారచన చేస్తోంది. 2023 ఎన్నికల కంటే ముందు టీఆర్‌ఎస్‌లో కీలకమైన ఎమ్మెల్యేలను లాగాలని ఎత్తుగడలు వేస్తోంది. కేసీఆర్‌కు కోలుకోలేని షాక్‌ ఇచ్చేందుకు ఇప్పటి నుంచే ప్లాన్‌లకు పదునుపెడుతోంది. కొంతమంది టీఆర్‌ఎస్‌ నేతలను ఇప్పటికే టచ్‌లోకి వెళ్లిన బీజేపీ అగ్రనేతలు… వారిని మరో ఏడాది ఆగాల్సిందిగా సూచించారట.

జీహెచ్‌ఎంసీ ఎన్నికల వేళ కూడా శాసనమండలి మాజీ ఛైర్మన్‌ స్వామిగౌడ్‌తో పాటు ఇతర పార్టీల నేతలను పార్టీలో చేర్చుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల టైమ్‌ దగ్గర పడే సమయం దాకా ద్వితీయ శ్రేణి నాయకత్వాలను పార్టీలో చేర్చుకోవాలనేది కమలం పార్టీ నేతల నిర్ణయం. ఒక్కసారి ఎన్నికలు దగ్గరపడితే పెద్ద తలకాయలకు వల వేస్తారనే ప్రచారం నడుస్తోంది. మొత్తానికి తెలంగాణ, బెంగాల్‌కు ఒకటే ప్లాన్‌ అమలు చేయాలనేది బీజేపీ పెద్దల వ్యూహం.

First Published:  18 Dec 2020 9:46 PM GMT
Next Story