Telugu Global
National

పళనివారి బహుమతులు... ఎన్నికల వేళ తాయిలాలు..!

తమిళనాడులో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయం వేడెక్కింది. ఇప్పటికే పార్టీ పెడుతున్నట్లు రజనీకాంత్​ ప్రకటించారు. కమల్​హాసన్​ నేతృత్వంలోని మక్కల్​ నీది మయ్యం పార్టీ ఎన్నికల బరిలో దిగబోతున్నది. మరోవైపు ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే కూడా ఎన్నికలు ఎప్పుడొస్తాయా అని ఎదురుచూస్తున్నది. ఈ క్రమంలో అధికార అన్నాడీఎంకే ప్రజలకు తాయిలాలు ప్రకటించింది. పొంగల్​ సందర్భంగా తెల్ల రేషన్​కార్డు దారులకు సరుకులు ఇవ్వనున్నారు. తమిళనాడులో 2.06 కోట్ల రేషన్‌కార్డు దారులకు కిలో బియ్యం, కిలో చక్కెర, ఒక చెరకు గడ, […]

పళనివారి బహుమతులు... ఎన్నికల వేళ తాయిలాలు..!
X

తమిళనాడులో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయం వేడెక్కింది. ఇప్పటికే పార్టీ పెడుతున్నట్లు రజనీకాంత్​ ప్రకటించారు. కమల్​హాసన్​ నేతృత్వంలోని మక్కల్​ నీది మయ్యం పార్టీ ఎన్నికల బరిలో దిగబోతున్నది. మరోవైపు ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే కూడా ఎన్నికలు ఎప్పుడొస్తాయా అని ఎదురుచూస్తున్నది. ఈ క్రమంలో అధికార అన్నాడీఎంకే ప్రజలకు తాయిలాలు ప్రకటించింది.

పొంగల్​ సందర్భంగా తెల్ల రేషన్​కార్డు దారులకు సరుకులు ఇవ్వనున్నారు.
తమిళనాడులో 2.06 కోట్ల రేషన్‌కార్డు దారులకు కిలో బియ్యం, కిలో చక్కెర, ఒక చెరకు గడ, 20 గ్రాముల కిస్‌మిస్‌, 20 గ్రాముల జీడిపప్పు, 5 గ్రాముల యాలకులు అందజేయనున్నారు. కరోనా లాక్​డౌన్​తో ప్రజలు అష్టకష్టాలు పడుతుంటే పట్టించుకోని సీఎం.. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయని తాయిలాలు ప్రకటించారని డీఎంకే అధినేత స్టాలిన్​ విమర్శలు గుప్పించారు.

కరోనా, వరదలతో నష్టపోయిన కుటుంబాలకు రూ.5000 చొప్పున ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అయితే, స్టాలిన్‌ విమర్శలపై స్పందించిన సీఎం పళనిస్వామి.. రేషన్‌ కార్డుదారులకు సంక్రాంతి సందర్భంగా 2014లో రూ.100, కిలో బియ్యం, కిలో చక్కెర ఇచ్చామని, 2018లో ఆ మొత్తాన్ని రూ.1000కి పెంచామని తెలిపారు. దానిలో భాగంగానే ఇప్పుడు రూ.2500 ఇస్తున్నామని తెలిపారు. మరోవైపు తమిళనాడులో రాజకీయాలు వేడెక్కాయి. ఇప్పటికే అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రచారం మొదలుపెట్టారు.

మక్కల్‌ నీది మయ్యం అధినేత, ప్రముఖ సినీనటుడు కమల్‌ హాసన్‌ ప్రచారయాత్రకు శ్రీకారం చుట్టారు. ఆయన రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. పలు చోట్ల అభిమానులు, పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తున్నారు.

మరోవైపు రజనీకాంత్​కూడా పార్టీని స్థాపించబోతున్నారు. డిసెంబర్‌ 31న పార్టీ పేరు ప్రకటించనున్నారు. రజనీ అభిమానులు కూడా తమిళనాడులో హడావుడి చేస్తున్నారు.

First Published:  20 Dec 2020 9:50 AM GMT
Next Story