Telugu Global
International

ఏమిటీ కరోనా స్ట్రెయిన్..? ఎందుకీ భయం..??

కరోనాతో చేస్తున్న పోరాటం ముగియకముందే… మరో కరోనా స్ట్రెయిన్ తో యుద్ధం చేయాల్సిన పరిస్థితి. బ్రిటన్ సహా పలు దక్షిణాఫ్రికా దేశాల్లో ఈ రూపాంతరం చెందిన కొత్త రకం కరోనా వైరస్ విజృంభిస్తోందన్న వార్తలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. మరో కరోనా స్ట్రెయిన్ గా రూపాంతరం చెందిన వైరస్ కారణంగా యూకేలో మరోసారి లాక్ డౌన్ విధించారు. కరోనాకంటే ఇది 70శాతం ఎక్కువ వేగంతో వ్యాప్తి చెందుతోందని అంటున్నారు యూకే వైద్య అధికారులు. వ్యాక్సిన్ ఈ కొత్త […]

ఏమిటీ కరోనా స్ట్రెయిన్..? ఎందుకీ భయం..??
X

కరోనాతో చేస్తున్న పోరాటం ముగియకముందే… మరో కరోనా స్ట్రెయిన్ తో యుద్ధం చేయాల్సిన పరిస్థితి. బ్రిటన్ సహా పలు దక్షిణాఫ్రికా దేశాల్లో ఈ రూపాంతరం చెందిన కొత్త రకం కరోనా వైరస్ విజృంభిస్తోందన్న వార్తలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.

మరో కరోనా స్ట్రెయిన్ గా రూపాంతరం చెందిన వైరస్ కారణంగా యూకేలో మరోసారి లాక్ డౌన్ విధించారు. కరోనాకంటే ఇది 70శాతం ఎక్కువ వేగంతో వ్యాప్తి చెందుతోందని అంటున్నారు యూకే వైద్య అధికారులు. వ్యాక్సిన్ ఈ కొత్త వైరస్ విరుగుడుకి పనిచేస్తుందని చెప్పడానికి ఆధారాలు లేవంటున్నారు.

అటు ఇటలీలో కూడా కరోనా కేసులు పెరుగుతుండటంతో మరోసారి లాక్ డౌన్ విధించారు. క్రిస్మస్ నేపథ్యంలో ప్రజలు గుమికూడే అవకాశం ఎక్కువగా ఉండటంతో ఈనెల 24నుంచి జనవరి 6 వరకు నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నట్టు ప్రకటించారు.

జర్మనీ, నెదర్లాండ్‌లలో కూడా రెండోసారి లాక్ డౌన్ అమలులోకి వచ్చేసింది. కరోనా లాగే రూపాంతరం చెందిన ఈ కరోనా స్ట్రెయిన్ వైరస్ కూడా ఇన్ ఫ్లూయెంజా రకానికి చెందినదే. ఇది మ్యుటేటెడ్ వైరస్ అని, శరీర కణజాలాన్ని రెండు లేదా అంతకంటే ఎక్కువ వైరస్ లు అటాక్ చేసినప్పుడు ఇది ఉత్పరివర్తనం చెందుతుందని, అత్యంత ప్రమాదకారి అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం బ్రిటన్ లో రూపాంతరం చెందిన ఈ వైరస్ ని గుర్తించారు.

బ్రిటన్ లో కరోనా లక్షణాలతో ఆస్పత్రుల్లో చేరుతున్న వారిలో 60శాతం మందికి కరోనాతోపాటు మ్యుటేటెడ్ కరోనా వైరస్ స్ట్రెయిన్ ఉన్నట్టు గుర్తించారని తెలుస్తోంది. దీంతో బ్రిటన్ తో బాహ్య ప్రపంచానికి సంబంధాలు తెగిపోయే ప్రమాదం ఏర్పడింది. నెదర్లాండ్, బెల్జియం దేశాలు.. బ్రిటన్ నుంచి వచ్చే విమానాలపై నిషేధం విధించాయి. ఆ రెండు దేశాలనుంచి కూడా బ్రిటన్ కి రవాణా సౌకర్యం పూర్తిగా స్తంభించిపోయింది. బ్రిటన్, దక్షిణాఫ్రికా దేశాలనుంచి వచ్చే విమానాలపై జర్మనీ నిషేధం విధించే దిశగా నిర్ణయం తీసుకుంది.

కరోనా కలవరాన్ని చైనా తీసుకొస్తే.. రూపాంతరం చెందిన ఈ కరోనా స్ట్రెయిన్ ఉపద్రవానికి బ్రిటన్ పుట్టినిల్లుగా మారిందనే విషయం అర్థమవుతోంది. అయితే ఇది కరోనా అంత ప్రమాదకారిగా పరిణామం చెందుతుందా లేదా అనేది తేలాల్సి ఉంది.

ఈ కరోనా స్ట్రెయిన్ జాడతో కొవిడ్ వ్యాక్సిన్ అనుమతులపై కూడా నీలి నీడలు కమ్ముకున్నాయి. కొవిడ్ టీకా వేసినా కూడా రూపాంతరం చెందిన ఈ కరోనా స్ట్రెయిన్ వైరస్ బారిన పడటం ఖాయం అని తేలితే మాత్రం.. వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలు కావాల్సిన దేశాల్లో.. మరికొంతకాలం ఆలస్యం అయ్యే అవకాశముంది. ప్రస్తుతానికి బ్రిటన్, దక్షిణాఫ్రికా దేశాల్లో మాత్రమే ఈ మ్యుటేటెడ్ కరోనా వైరస్ స్ట్రెయిన్ జాడ బయటపడింది.

First Published:  20 Dec 2020 11:40 PM GMT
Next Story