Telugu Global
National

పార్టీ ఆదేశిస్తే కేసీఆర్​పై పోటీచేస్తా... రాములమ్మ

తెలంగాణ ఫైర్​బ్రాండ్​ విజయశాంతి ఇటీవల బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె వరుసగా టీవీ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తెలంగాణలో టీఆర్​ఎస్​కు సరైన ప్రత్యామ్నాయం బీజేపీయేనని చెప్పారు. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో బీజేపీ బలపడటం ఖాయమని.. తెలంగాణలో అధికారంలోకి కూడా వస్తామని చెప్పారు. తెలంగాణ ప్రజలను కేసీఆర్​ వరుసగా మోసం చేస్తూ వస్తున్నారని.. ఆయన మోసాలను ప్రజలు కొంతకాలం నమ్మారని.. ఇప్పుడు నమ్మే పరిస్థితి లేదన్నారు. కేసీఆర్​ పట్ల తెలంగాణ నిరుద్యోగులు, విద్యార్థులు, […]

పార్టీ ఆదేశిస్తే కేసీఆర్​పై పోటీచేస్తా... రాములమ్మ
X

తెలంగాణ ఫైర్​బ్రాండ్​ విజయశాంతి ఇటీవల బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె వరుసగా టీవీ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తెలంగాణలో టీఆర్​ఎస్​కు సరైన ప్రత్యామ్నాయం బీజేపీయేనని చెప్పారు. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో బీజేపీ బలపడటం ఖాయమని.. తెలంగాణలో అధికారంలోకి కూడా వస్తామని చెప్పారు. తెలంగాణ ప్రజలను కేసీఆర్​ వరుసగా మోసం చేస్తూ వస్తున్నారని.. ఆయన మోసాలను ప్రజలు కొంతకాలం నమ్మారని.. ఇప్పుడు నమ్మే పరిస్థితి లేదన్నారు.

కేసీఆర్​ పట్ల తెలంగాణ నిరుద్యోగులు, విద్యార్థులు, వివిధ ప్రజాసంఘాల వాళ్లు, ఉద్యమకారులు, ప్రజాస్వామిక వాదులు వ్యతిరేకంగా ఉన్నారన్నారు. వారంతా ప్రజలకు కేసీఆర్​ చేసిన మోసాలను వివరిస్తున్నారన్నారు. అయితే ఇంతకాలం తెలంగాణలో టీఆర్​ఎస్​ కు సరైన ప్రత్యామ్నాయం లేదని.. ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ బలపడుతోందని చెప్పారు.

కేసీఆర్​ పట్ల తనకు వ్యక్తిగత వైరం లేదని ఆయన పట్ల కక్షసాధింపు తనకు ఉండదని చెప్పారు. మరోవైపు ఉద్యమ సమయంలో జరిగిన పలు సంఘటనలను విజయశాంతి గుర్తుచేసుకున్నారు. బీజేపీ నుంచి బయటకొచ్చిన విజయశాంతి తెలంగాణ ఉద్యమసమయంలో తల్లి తెలంగాణ పార్టీని స్థాపించారు.

అనంతరం తెలంగాణ కోసం పోరాడే పార్టీలన్నీ ఓకే గొడుకు కిందకు రావాలన్న కేసీఆర్​ సూచనతో ఆమె తనపార్టీని టీఆర్​ఎస్​లో విలీనం చేశారు. తొలుత కేసీఆర్​ కూడా విజయశాంతికి ఎనలేని ప్రాధాన్యమిచ్చారు. ఆమెను పార్టీ జనరల్​ సెక్రటరీగా నియమించారు. అయితే పేరుకే పదవి ఉన్నప్పటికీ పార్టీ నిర్ణయాల్లో ఆమె ప్రమేయం ఉండేది కాదు. దీంతో ఆమె పార్టీ నుంచి బయటకొచ్చారు. ఉద్యమ సమయంలో తాను టీఆర్​ఎస్​కు ఎంతో ఆర్థికసాయం చేశానని విజయ శాంతి చెప్పారు. అయితే ఆ డబ్బు దుర్వినియోగం చేశారని ఆమె ఆరోపించారు. ఇటీవల విజయశాంతి సోషల్​మీడియాలో చురుగ్గా ఉంటున్నారు.

సీఎం కేసీఆర్​, తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాలను ఆమె తీవ్రంగా తప్పుబడుతున్నారు. అయితే ప్రస్తుతం బీజేపీలోనైనా రాములమ్మ ఇమడగలుగుతుందా? లేదా అని రాజకీయవిశ్లేషకులు అనుమానిస్తున్నారు. అందుకు కారణం రాములమ్మ బీజేపీలో ఉన్న పరిస్థితి.. ఇప్పటి పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. కాంగ్రెస్​ నుంచి బీజేపీలో చేరిన డీకే అరుణ జాతీయస్థాయి పదవిలో ఉన్నారు. మరోవైపు ఇప్పుడు కరీంనగర్​ ఎంపీ బండి సంజయ్​ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యారు. మరో ఎంపీ అర్వింద్​ బీజేపీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. యువనేతలను ఆ పార్టీ ప్రోత్సహిస్తున్నది.

ఈ క్రమంలో వివిధ పార్టీలు మారి చివరకు బీజేపీలో చేరిన విజయశాంతికి బీజేపీలో ఎటువంటి ప్రాధాన్యత దక్కుతుందో వేచిచూడాలి. ఇప్పటికే సీనియర్​ నేతలు కిషన్​రెడ్డి, లక్ష్మణ్​ వారి వర్గానికి… బండిసంజయ్​, అర్వింద్​ వర్గానికి మధ్య గ్యాప్​ ఏర్పడింది. మరోవైపు పాలమూరుకు చెందిన డీకే అరుణ కాంగ్రెస్​ మార్క్​ గ్రూప్​ రాజకీయాలకు తెరలేపారు. ఈ క్రమంలో విజయశాంతి బీజేపీలో ఎలా ఇముడుతారో వేచి చూడాలి.

First Published:  21 Dec 2020 3:33 AM GMT
Next Story