Telugu Global
Health & Life Style

కొవ్వు కరిగేందుకు ఓ లెక్కుంది...

మనలో చాలామంది బరువు తగ్గడం కోసం నానా తిప్పలు పడుతుంటారు. జిమ్ వర్కవుట్స్‌ నుంచి యోగాసనాల వరకూ రకరకాల వెరైటీలు ట్రై చేస్తుంటారు. అయినప్పటికీ చాలాసార్లు కావాల్సిన రిజల్ట్ కనిపించదు. అసలు కొవ్వు కరగడం వెనుక ఉన్న మర్మం ఏంటి? ఫ్యాట్‌ను బర్న్ చేయడం మన టార్గెట్ అయితే.. దానికి హై ఇంటెన్సిటీ, కార్డియో లాంటి వ్యాయామాలు బెస్ట్ ఆప్షన్. వాటితో కొవ్వును ఈజీగా కరిగించుకోవచ్చు. కానీ కొంతమందిలో ఎన్ని వర్కవుట్స్ చేసినా.. కొవ్వు కరిగినట్టు కనిపించదు. […]

కొవ్వు కరిగేందుకు ఓ లెక్కుంది...
X

మనలో చాలామంది బరువు తగ్గడం కోసం నానా తిప్పలు పడుతుంటారు. జిమ్ వర్కవుట్స్‌ నుంచి యోగాసనాల వరకూ రకరకాల వెరైటీలు ట్రై చేస్తుంటారు. అయినప్పటికీ చాలాసార్లు కావాల్సిన రిజల్ట్ కనిపించదు. అసలు కొవ్వు కరగడం వెనుక ఉన్న మర్మం ఏంటి?
ఫ్యాట్‌ను బర్న్ చేయడం మన టార్గెట్ అయితే.. దానికి హై ఇంటెన్సిటీ, కార్డియో లాంటి వ్యాయామాలు బెస్ట్ ఆప్షన్. వాటితో కొవ్వును ఈజీగా కరిగించుకోవచ్చు. కానీ కొంతమందిలో ఎన్ని వర్కవుట్స్ చేసినా.. కొవ్వు కరిగినట్టు కనిపించదు. ఎందుకంటే కొవ్వు కరగడానికి ఓ లెక్కుంది అదేంటంటే..

ఫ్యాట్ బర్నింగ్ జోన్

వర్కవుట్స్ చేసేటప్పుడు ముందుగా శరీరం క్యాలరీల రూపంలో ఉన్న కార్బోహైడ్రేట్స్‌ను కరిగిస్తుంది. అయితే ఈ కార్బోహైడ్రేట్స్‌ను కరిగించే సరికే చాలామందికి చెమటలు పట్టి, అలసి పోయినట్టు అనిపిస్తుంది. కానీ అసలు మర్మం ఇక్కడే ఉంది. ఎప్పుడైతే కార్బోహైడ్రేట్స్ అన్నీ ఖర్చయ్యాక కూడా శరీరం వర్కవుట్‌ని కంటిన్యూ చేస్తుందో.. అప్పుడు ఖర్చు చేయడానికి క్యాలరీలు లేక చివరగా ఫ్యాట్‌ను కరిగించడం మొదలుపెడుతుంది. దీన్నే ‘పొటెన్షియల్ జోన్ లేదా ఫ్యాట్ బర్నింగ్ జోన్’ అంటారు.

ఈ స్టేజీకి సక్సెస్‌ఫుల్‌ రీచ్ అయితే.. కొవ్వు కరగడం, బరువు తగ్గడం మొదలవుతుంది. అయితే ఫ్యాట్ బర్నింగ్ జోన్‌లోకి ఎంటర్ అవ్వాలంటే.. వ్యాయామం చేసే సమయాన్ని మెల్లగా పెంచుకుంటూ పోవాలి. ఒకేసారి మితిమీరిన వ్యాయామాలు చేయకూడదు. క్రమం తప్పకుండా రోజూ వ్యాయామాలు చేస్తూ ఉండాలి. అలా కొంతకాలానికి తీసుకునే క్యాలరీల కంటే ఖర్చయ్యే క్యాలరీల రేటు పెరుగుతుంది. అప్పుడు కొవ్వు మెల్లగా కరగడం మెదలవుతుంది.

ఇలా లెక్కించాలి

శరీరం ఆక్సిజన్ తీసుకునే శాతం ముప్పై నుంచి యాభైశాతం వరకూ పెరిగినప్పుడు ఫ్యాట్ బర్నింగ్ జోన్ మొదలవుతుంది. ఇది ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. దీన్ని లెక్కించేందుకు ఒక ఫార్ములా ఉంది.

(220)-– (వయస్సు) x (0.66)… ఈ ఫార్ములా ద్వారా మ్యాగ్జిమమ్ హార్ట్ రేటును లెక్కించొచ్చు. ఉదాహరణకు ఒకరి వయసు ముప్పై అయితే.. వాళ్ల మ్యాగ్జిమమ్ హార్ట్ రేటు 200 ఉంటుంది. మ్యాగ్జిమమ్ హార్ట్ రేటులో ముప్పై నుంచి యాభై శాతం అంటే.. హార్ట్ రేట్ సుమారుగా 65 నుంచి 100 ఉండాలి. హార్ట్ రేట్ 65 నుంచి100 మధ్యలో ఉన్నప్పుడు ఫ్యాట్ బర్నింగ్ జోన్ మొదలవుతుంది.

ఇది కూడా ముఖ్యమే..

బరువు తగ్గాలంటే.. శరీర మెటబాలిజం ఎక్కువ ఉండాలి. ఎక్కువ మెటబాలిజం ఉన్న వాళ్లలో క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. తక్కువ మెటబాలిజం ఉంటే ఆ క్యాలరీలన్నీ ఫ్యాట్ రూపంలో స్టోర్ అవుతాయి. అందుకే అతిగా పేరుకున్న కొవ్వును కరిగించాలంటే ముందు తగ్గిపోయిన మెటబాలిజం రేటును పెంచాలి. మెటబాలిజం పెరగాలంటే.. క్రమం తప్పకుండా ఒకే టైంలో వ్యాయామం చేయడం, సరైన డైట్ పాటించడం, లైఫ్‌స్టైల్ క్రమశిక్షణగా ఉండేలా చూసుకోవడం చేయాలి.

First Published:  20 Dec 2020 7:02 PM GMT
Next Story