Telugu Global
NEWS

బ్యాంకుల ముందు చెత్త... ఇదెక్కడి సంస్కృతి...

రుణాలు ఇవ్వడంలేదన్న కోపంతో బ్యాంకుల ముందు పారిశుధ్య కార్మికులు చెత్త వేసి నిరసన తెలిపిన ఘటన కృష్ణాజిల్లాలో సంచలనంగా మారింది. ఈ వ్యవహారంపై ఏకంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆరా తీయడం, అసలేం జరిగిందో కనుక్కోవాలని రాష్ట్ర ఆర్థిక మంత్రికి చెప్పడంతో వ్యవహారం మరింత చర్చనీయాంశమైంది. రుణాలు ఇవ్వకపోవడం బ్యాంకు సిబ్బంది చేసిన తప్పా? లేక రుణాల నెపంతో బ్యాంకుల ముంతు చెత్త పోయడం పారిశుధ్య సిబ్బంది అనాలోచిత నిర్ణయమా అనేది తేలాల్సి ఉంది. […]

బ్యాంకుల ముందు చెత్త... ఇదెక్కడి సంస్కృతి...
X

రుణాలు ఇవ్వడంలేదన్న కోపంతో బ్యాంకుల ముందు పారిశుధ్య కార్మికులు చెత్త వేసి నిరసన తెలిపిన ఘటన కృష్ణాజిల్లాలో సంచలనంగా మారింది. ఈ వ్యవహారంపై ఏకంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆరా తీయడం, అసలేం జరిగిందో కనుక్కోవాలని రాష్ట్ర ఆర్థిక మంత్రికి చెప్పడంతో వ్యవహారం మరింత చర్చనీయాంశమైంది. రుణాలు ఇవ్వకపోవడం బ్యాంకు సిబ్బంది చేసిన తప్పా? లేక రుణాల నెపంతో బ్యాంకుల ముంతు చెత్త పోయడం పారిశుధ్య సిబ్బంది అనాలోచిత నిర్ణయమా అనేది తేలాల్సి ఉంది.

అసలేం జరిగింది..?

విజయవాడలోని మూడు యూనియన్ బ్యాంక్ శాఖలు, సింగ్ ‌నగర్‌ ఎస్.బి.ఐ, ఉయ్యూరులోని యూబీఐ, ఎస్.బి.ఐ., సిండికేట్‌, కార్పొరేషన్‌ బ్యాంకులు, మచిలీపట్నంలోని యూబీఐ శాఖల ముందు ఇలా చెత్త పోశారు పారిశుధ్య సిబ్బంది. రుణాలు ఇవ్వనందుకు నిరసనగా ఇలా చేసినట్లు ఉయ్యూరులోని బ్యాంక్ గేటుకి పురపాలక కమిషనర్‌ పేరుతో కాగితం అంటించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ఇలా చేశామని కార్మికులు చెప్పడంతో మరింత కలకలం రేగింది.

ఉన్నతాధికారులకు ఇలాంటి చెత్త ఐడియా ఎందుకొచ్చిందని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు గొల్లపూడిలోని యూబీఐ ఎదుట పంచాయతీ సిబ్బంది చెత్తతో ఉన్న ట్రాక్టర్‌ను నిలిపి మరీ బ్యాంక్ మేనేజర్ తో చర్చలు జరపడం, వారు రుణాలు ఇస్తామని చెప్పిన తర్వాత ట్రాక్టర్ ను తీసేయడం ఇవన్నీ ఉద్దేశపూర్వకంగానే చేసినట్టు అర్థమవుతోంది.

సాక్షాత్తూ కలెక్టర్ ఈ విషయంలో జోక్యం చేసుకోవడంతో హుటాహుటిన మున్సిపల్ సిబ్బంది బ్యాంకుల వద్ద శుభ్రం చేశారు. ప్రభుత్వ పథకాలకు సంబంధించి రుణాలు ఇవ్వడం లేదని బ్యాంకులపై కోపంతో ఇలా చేయడం సరికాదని, పలు ఖాతాలు కేవేసీ చేయకపోవడంతో చలామణిలో లేవని, అందుకే రుణాల మంజూరులో కాస్త ఆలస్యం జరిగిందని సిబ్బంది వివరణ ఇస్తున్నారు. కేవలం కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఇలాంటి పరిస్థితి తలెత్తిందని చెబుతున్నారు.

మరోవైపు ప్రతిపక్షాలు ఈ వ్యవహారంపై రాద్ధాంతం మొదలు పెట్టాయి. చంద్రబాబు తన ట్విట్టర్ అకౌంట్ లో ఈ విషయాన్ని ప్రస్తావించి.. ప్రభుత్వ పథకాలు పేదలకు అందకపోవడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేముందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఈ వ్యవహారంపై ప్రభుత్వం మరింత సీరియస్ గా దృష్టిపెట్టింది. అటు కేంద్రం కూడా ఆరా తీయడంతో.. మున్సిపల్ సిబ్బందిపై చర్యలు తీసుకోడానికి సమాయత్తమైంది.

First Published:  25 Dec 2020 1:03 AM GMT
Next Story