Telugu Global
National

పెళ్లిలో పీరియడ్స్... విడాకులకోసం కోర్టుకి !

నెలసరి విషయంలో సమాజంలో ఉన్న మూఢత్వం, మూర్ఖత్వాలు వదిలిపోవాలని ఆధునిక మహిళల ప్రయత్నాలు, పోరాటాలు ఒక పక్కన జరుగుతున్నాయి. మరోపక్క పరిస్థితులు అలాగే ఉన్నాయని, సమాజంలో ఈ విషయం పట్ల ఎలాంటి మార్పులు రాలేదని తెలిపే సంఘటనలు సైతం అదే స్థాయిలో కనబడుతున్నాయి. గుజరాత్ రాష్ట్రంలోని వడోదరకు చెందిన ఓ వ్యక్తి… పెళ్లి సమయంలో నెలసరిలో ఉన్నా… ఆ విషయం తమకు చెప్పలేదనే కారణంతో…  భార్యతో విడాకులు కావాలంటూ కోర్టుకెక్కాడు. ఒక మీడియా నివేదిక ప్రకారం… ఫ్యామిలీ […]

పెళ్లిలో పీరియడ్స్... విడాకులకోసం కోర్టుకి !
X

నెలసరి విషయంలో సమాజంలో ఉన్న మూఢత్వం, మూర్ఖత్వాలు వదిలిపోవాలని ఆధునిక మహిళల ప్రయత్నాలు, పోరాటాలు ఒక పక్కన జరుగుతున్నాయి. మరోపక్క పరిస్థితులు అలాగే ఉన్నాయని, సమాజంలో ఈ విషయం పట్ల ఎలాంటి మార్పులు రాలేదని తెలిపే సంఘటనలు సైతం అదే స్థాయిలో కనబడుతున్నాయి. గుజరాత్ రాష్ట్రంలోని వడోదరకు చెందిన ఓ వ్యక్తి… పెళ్లి సమయంలో నెలసరిలో ఉన్నా… ఆ విషయం తమకు చెప్పలేదనే కారణంతో… భార్యతో విడాకులు కావాలంటూ కోర్టుకెక్కాడు.

ఒక మీడియా నివేదిక ప్రకారం… ఫ్యామిలీ కోర్టులో అతను విడాకులకు అప్లయి చేశాడు. పెళ్లయిన తరువాత గుడికి వెళ్లాలనుకున్న సందర్భంలో… పెళ్లి సమయంలో ఆ అమ్మాయి నెలసరితో ఉన్న సంగతి తెలిసి తానూ తన తల్లి ఆశ్చర్యానికి గురయ్యామని అతను పేర్కొన్నాడు. తమ కుటుంబ నమ్మకాలను ఆమె ధిక్కరించిందని అతను తెలిపాడు. అంతే కాకుండా ఆమె తననుండి తన శక్తికి మించిన డబ్బుని, విలాసాలను ఆశిస్తున్నదని కూడా ఆరోపించాడు. ఈ ఏడాది జనవరి చివర్లో వీరి వివాహం జరిగింది. అతను ప్రయివేటు కంపెనీలో పనిచేస్తుండగా, ఆమె టీచరు. కుటుంబ ఖర్చులకు ఇంట్లో డబ్బు ఇవ్వవద్దని చెప్పిందని, దానికి బదులుగా ఆమె తనకు ఐదువేల రూపాయలు ఇవ్వాలని కోరిందని, అలాగే ఏసీ కావాలని అడిగిందని అతను వెల్లడించాడు.

తనతో పోట్లాడి ఆమె తన పుట్టింటికి వెళ్లిపోయిందని, తాను ఎంతగా అడిగినా తిరిగి రాలేదని తెలిపాడు. తనపై, తన కుటుంబంపై తప్పుడు కేసులు పెట్టటం జరిగిందని దాంతో తాను విడాకులకు అప్లయి చేయటం జరిగిందన్నాడు. కుటుంబ కోర్టులో పిటీషన్ వేశామని, కోర్టు దానిని స్వీకరించి విచారణ జరుపుతుందని అతని తరపు న్యాయవాది వెల్లడించాడు. ఏదిఏమైనా అతను చెబుతున్న దాంట్లో నిజం ఉందా… లేదా నెలసరి విషయం ఆమె దాచిందనే కోపంతో విడాకులు అడుగుతున్నాడా… అనేది కోర్టు తేల్చాల్సి ఉంది.

First Published:  25 Dec 2020 6:12 AM GMT
Next Story