Telugu Global
NEWS

తండ్రీ కొడుకులు విషపు గుళికలు " ఎంపీ నందిగం సురేష్ ధ్వజం...

అమరావతి ప్రాంతంలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడాన్ని అడ్డుకున్న టీడీపీ డెమోగ్రాఫికల్ ఇంబాలన్స్ అంటూ.. పేదలను అవమానించిందని మండిపడ్డారు బాపట్ల ఎంపీ నందిగం సురేష్. అమరావతి అంటే కేవలం పెద్దలకేనా, పేదలకు అందులో చోటు లేదా అని ప్రశ్నించారు. అమరావతికి ఆ పేరు కాకుండా అల “చంద్రపురం” అని పేరు పెట్టుకుంటే బాగుండేదని ఎద్దేవా చేశారు. నిజంగా అమరావతిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేదలు ఉండాలనుకుంటే టీడీపీ నేతలు కోర్టుల్లో స్టేలు వెకేట్ చేయించాలని డిమాండ్ […]

తండ్రీ కొడుకులు విషపు గుళికలు  ఎంపీ నందిగం సురేష్ ధ్వజం...
X

అమరావతి ప్రాంతంలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడాన్ని అడ్డుకున్న టీడీపీ డెమోగ్రాఫికల్ ఇంబాలన్స్ అంటూ.. పేదలను అవమానించిందని మండిపడ్డారు బాపట్ల ఎంపీ నందిగం సురేష్. అమరావతి అంటే కేవలం పెద్దలకేనా, పేదలకు అందులో చోటు లేదా అని ప్రశ్నించారు. అమరావతికి ఆ పేరు కాకుండా అల “చంద్రపురం” అని పేరు పెట్టుకుంటే బాగుండేదని ఎద్దేవా చేశారు. నిజంగా అమరావతిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేదలు ఉండాలనుకుంటే టీడీపీ నేతలు కోర్టుల్లో స్టేలు వెకేట్ చేయించాలని డిమాండ్ చేశారు.

అమరావతి ఎవరిది..?

అమరావతి చంద్రబాబు రాజధానే తప్ప ప్రజల రాజధాని కాదని విమర్శించారు ఎంపీ సురేష్. అమరావతి పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని, ఎవరెవరు ఎంతమేర బాగు పడ్డారో చర్చకు సిద్ధమా అంటూ లోకేష్ కి సవాల్ విసిరారు. అమరావతిలోని 29 గ్రామాల పేదల గురించి మాట్లాడే హక్కు టీడీపీ నేతలకు లేదని, వారంతా రియల్ ఎస్టేట్ వ్యాపారులని, జేఏసీ పేరుతో ఏసీ కారుల్లో తిరుగుతున్నవారు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారులేనని అన్నారు. అమరావతి పేరుతో రాష్ట్ర ప్రయోజనాలను, పేదల ప్రయోజనాలను చంద్రబాబు దెబ్బతీయాలని చూశారు కాబట్టే, టీడీపీని 23 సీట్లకు పరిమితం చేసి, రాజధాని పక్కనే ఉన్న మంగళగిరిలో బాబు కొడుకు లోకేష్ ని చిత్తు చిత్తుగా ఓడించారని అన్నారు. ఇకనైనా జేఏసీ ముసుగులో అమరావతి రాజకీయాలు ఆపాలని కోరారు. చంద్రబాబు ఓ పథకం ప్రకారం ఎంపిక చేసిన ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి, మిగతా రైతులు ఉన్న ప్రాంతాన్ని గ్రీన్ జోన్ గా ప్రకటించారని ఆరోపించారు. రైతులు స్వచ్ఛందంగా భూములు ఇవ్వలేదని, భూముల కోసం రైతుల్ని వేధింపులకు గురి చేశారని మండిపడ్డారు. బాబు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భాగస్వాములు అయిన జేఏసీ నేతలు.. అమరావతికోసం త్యాగం చేశామంటే ఎలా నమ్మాలని అన్నారు.

పేదల ఇళ్లపై అంత అక్కసు ఎందుకు..?

పేదలకు ఇళ్ళ పట్టాలు ఇస్తుంటే.. బాత్రూమ్ ల లాంటి ఇళ్లు అంటూ టీడీపీ నేతలు అవమానిస్తున్నారని మండిపడ్డారు ఎంపీ సురేష్. పేదల ఇళ్ళంటే మీకు అంత చులకనా..? అని ప్రశ్నించారు. పేదల చెమట వాసన టీడీపీ నేతలకు నచ్చదని, పేదవాళ్లెప్పుడూ మురికి కాల్వల పక్కన ఊరికి దూరంగా ఉండాలని కోరుకుంటారని అన్నారు. అందుకే అమరావతిలో ఇళ్ల పట్టాల పంపిణీని అడ్డుకున్నారని చెప్పారు. వైసీపీ హయాంలో రాష్ట్రంలో 31 లక్షల ఇళ్ళు పేదలకు కట్టిస్తున్నామని, కొత్తగా 17 వేల ఊళ్లు ఏర్పడుతున్నాయని.. వీటిని దాటుకుని చంద్రబాబు ఇంకెక్కడికి పారిపోతారని అన్నారు సురేష్. హైదరాబాద్ రాజప్రాసాదంలో ఉంటూ.. వలస ప్రయాణికుల్లా, టూరిస్టుల్లా చంద్రబాబు, లోకేష్ రాష్ట్రానికి వస్తున్నారని మండిపడ్డారు.

చంద్రబాబు మనవడికి కూడా కోట్ల రూపాయల ఆస్తులా..?

2 ఎకరాల నుంచి రూ. 2 లక్షల కోట్లకు చంద్రబాబు, లోకేష్ ఆస్తులు పెరిగాయని, పేదల గురించి మాట్లాడే వీరిద్దరూ, ఆ కిటుకేంటో చెబితే.. పేదవారు కూడా బాగు పడతారు కదా అని ప్రశ్నించారు. ఆఖరికి లోకేష్ కుమారుడికి కూడా వందల కోట్లు ఆస్తులు ఉన్నాయని, ఆయన ఏం బిజినెస్ చేస్తున్నారని ప్రశ్నించారు. పాకిస్తాన్ లో ఉగ్రవాదుల్లా తయారై అమరావతి ఆగమైపోతుందంటూ కెమెరా ఉద్యమాలు చేస్తున్నారని, ఇకనైనా ఈ డ్రామాలు ఆపాలని, అమరావతిలో పేదవారిని బతకనివ్వాలని అన్నారు.

చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు అమరావతి ప్రాంతంలో అరటి తోటలు తగులబెట్టిన కేసులలో తనతోపాటు చాలామందిని ఇరికించాలని చూశారని, ఆ ఘటనల వెనక అసలైన కుట్రదారులు ఎవరు, పాత్రధారులెవరో తేల్చబోతున్నామని అన్నారు ఎంపీ సురేష్.

First Published:  27 Dec 2020 8:42 AM GMT
Next Story