Telugu Global
NEWS

మాట మార్చిన హనుమంతు

టీపీసీసీ అధ్యక్ష పదవి ఎంపిక కోసం కాంగ్రెస్​ అధిష్ఠానం తీవ్ర కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. మరోవైపు రేవంత్​రెడ్డికి పదవి కన్​ఫార్మ్​ అయ్యిందని.. ఈ నిర్ణయంతో అసంతృప్తిగా ఉన్నవాళ్లను అధిష్ఠానం బుజ్జగిస్తున్నట్టు సమాచారం. సీనియర్​ కాంగ్రెస్​ నేత వీహెచ్​ ఇప్పటికే అధిష్ఠానంపై ఫైర్​ అయ్యారు. తన అభిప్రాయాలను ఏ మాత్రం గౌరవించలేదని ఆయన ఏకంగా రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం ఠాగూర్​పైనే విమర్శలు గుప్పించారు. ఠాగూర్​ ప్యాకేజ్​కు అమ్ముడుపోయారని ఆరోపించారు. పీసీసీ అధ్యక్షుడిగా ఎవరైతే బాగుంటుంది అనే విషయమై […]

మాట మార్చిన హనుమంతు
X

టీపీసీసీ అధ్యక్ష పదవి ఎంపిక కోసం కాంగ్రెస్​ అధిష్ఠానం తీవ్ర కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. మరోవైపు రేవంత్​రెడ్డికి పదవి కన్​ఫార్మ్​ అయ్యిందని.. ఈ నిర్ణయంతో అసంతృప్తిగా ఉన్నవాళ్లను అధిష్ఠానం బుజ్జగిస్తున్నట్టు సమాచారం. సీనియర్​ కాంగ్రెస్​ నేత వీహెచ్​ ఇప్పటికే అధిష్ఠానంపై ఫైర్​ అయ్యారు. తన అభిప్రాయాలను ఏ మాత్రం గౌరవించలేదని ఆయన ఏకంగా రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం ఠాగూర్​పైనే విమర్శలు గుప్పించారు. ఠాగూర్​ ప్యాకేజ్​కు అమ్ముడుపోయారని ఆరోపించారు.

పీసీసీ అధ్యక్షుడిగా ఎవరైతే బాగుంటుంది అనే విషయమై ఇప్పటికే కాంగ్రెస్​ పార్టీ అనేకమంది సీనియర్ల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొంది. కొండా సురేఖకు కూడా ఢిల్లీ నుంచి పిలుపు వచ్చినట్టు సమాచారం. కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం తరపున ఠాగూర్, కేసీ వేణుగోపాల్ ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారు. అటు రాహుల్ గాంధీ ఉత్తమ్ తో మాట్లాడబోతున్నారు. ఆయన అభిప్రాయం కూడా తీసుకోబోతున్నారు. సీనియర్లతో సంప్రదింపులు పూర్తి చేసి మరో రెండ్రోజుల్లోనే కాంగ్రెస్​ హైకమాండ్ పీసీసీ అధ్యక్ష పదవిపై తుది నిర్ణయం ప్రకటించనున్నట్టు సమాచారం.

కాగా కాంగ్రెస్​ సీనియర్​ నేత వీహెచ్​ వ్యాఖ్యలపై అధిష్ఠానం సీరియస్​ అయ్యింది. తన వ్యాఖ్యలకు వివరణ పంపించాలని వీహెచ్​కు నోటీసులు పంపిందట. అయితే తాను దురుద్దేశ్యంతో ఆ వ్యాఖ్యలు చేయలేదని.. మీడియా తన మాటలను వక్రీకరించిందని వీహెచ్​ వివరణ పంపారట.

మరోవైపు ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పీసీసీ ఎంపికలో ఏకాభిప్రాయం సాధ్యం కాదని ఆమె పేర్కొన్నారు. సీతక్క అలియాస్​ అనసూయ రేవంత్​రెడ్డి ప్రధాన అనుచరురాలు. వీళ్లిద్దరూ గతంలో టీడీపీలో కలిసి పనిచేశారు. సీతక్క రేవంత్​రెడ్డితో పాటు కాంగ్రెస్​లోకి వచ్చారు. రేవంత్​కు ప్రధాన అనుచరురాలిగా ఆమెకు పేరుపడిపోయింది. రేవంత్​రెడ్డికి పీసీసీ అధ్యక్షపదవి దక్కాలని ఆమె కోరుకుంటున్నారు. ఫైనల్ గా కాంగ్రెస్​ హై కమాండ్​ ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

First Published:  27 Dec 2020 11:32 PM GMT
Next Story