Telugu Global
NEWS

కేసీఆర్‌ నిర్ణయం పై విజయశాంతి మండిపాటు

‘నియంత్రిత సాగు’ పై తెలంగాణ సీఎం కేసీఆర్​ వెనక్కి తగ్గారు. ఈ విధానాన్ని రద్దు చేస్తున్నట్టు రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది. రైతులు తమకు ఇష్టం వచ్చిన పంటను వేసుకోవచ్చని ప్రభుత్వం పేర్కొన్నది. గత ఏడాది సీఎం కేసీఆర్​ ఈ నియంత్రిత సాగు విధానాన్ని తీసుకొచ్చారు. రైతులు ప్రభుత్వం సూచించిన పంటలే వేసుకోవాలని.. అలా వేసుకుంటేనే ప్రభుత్వం పంట కొనుగోలు చేస్తుందని చెప్పారు. ఈ మేరకు ఆయా మండలాల్లో వ్యవసాయాధికారులు సర్వే చేసి రైతులు ఏయే పంటలు వేసుకోవాలో సూచించారు. […]

కేసీఆర్‌ నిర్ణయం పై విజయశాంతి మండిపాటు
X

‘నియంత్రిత సాగు’ పై తెలంగాణ సీఎం కేసీఆర్​ వెనక్కి తగ్గారు. ఈ విధానాన్ని రద్దు చేస్తున్నట్టు రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది. రైతులు తమకు ఇష్టం వచ్చిన పంటను వేసుకోవచ్చని ప్రభుత్వం పేర్కొన్నది. గత ఏడాది సీఎం కేసీఆర్​ ఈ నియంత్రిత సాగు విధానాన్ని తీసుకొచ్చారు. రైతులు ప్రభుత్వం సూచించిన పంటలే వేసుకోవాలని.. అలా వేసుకుంటేనే ప్రభుత్వం పంట కొనుగోలు చేస్తుందని చెప్పారు. ఈ మేరకు ఆయా మండలాల్లో వ్యవసాయాధికారులు సర్వే చేసి రైతులు ఏయే పంటలు వేసుకోవాలో సూచించారు.

పత్తి, కంది, వరి ఎక్కువగా సాగుచేయాలని మొక్కజొన్న సాగు చేసుకోవద్దని ప్రభుత్వం సూచించింది. ఒకవేళ మొక్కజొన్న సాగుచేస్తే ప్రభుత్వం కొనుగోలు చేయదని కూడా ప్రకటించారు. ప్రభుత్వం సూచించిన పంటలు వేసుకోకపోతే రైతు బంధు సొమ్ము కూడా వేయరని కొందరు అధికారులు ప్రచారం చేశారు. దీంతో రైతులు భయపడి ప్రభుత్వం సూచించిన పంటలు వేసుకున్నారు.

అయితే ప్రభుత్వ సూచనమేరకు తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రైతులు సన్న వరి రకాలు సాగు చేశారు. కానీ ప్రభుత్వం సన్న వరిని మద్దతు ధరకు కొనుగోలు చేయలేదు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ విషయంలో విపక్షాలు కూడా ఆందోళన చేశాయి. దీంతో ప్రభుత్వం మీద కూడా విమర్శలు వచ్చాయి. అయితే ఎట్టకేలకు సీఎం కేసీఆర్​ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు.

ఆదివారం సాయంత్రం వ్యవసాయరంగంపై సమీక్ష నిర్వహించారు. పంటల కొనుగోళ్లు, నియంత్రిత సాగు విధానం, రైతుబంధు అమలు, మార్కెట్లో వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలు – కొనుగోళ్లు, రైతుబంధు సమితుల బాధ్యతలు, రైతు వేదికల వినియోగం, సకాలంలో విత్తనాలు-ఎరువులు అందుబాటులో ఉంచడం తదితర అంశాలపై సుధీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశం అనంతరం నియంత్రిత సాగు విధానం రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

అయితే కేసీఆర్​ నియంత్రిత సాగుపై యూటర్న్​ తీసుకోవడంపై బీజేపీ నాయకురాలు విజయశాంతి మాట్లాడుతూ.. ‘ నియంత్రిత సాగు అనేది ఓ పిచ్చి నిర్ణయం. దీని వల్ల చాలా మంది రైతులు నష్టపోయారు. ఇప్పుడు యూటర్న్​ తీసుకున్నారు సరే.. గత ఏడాది నష్టపోయిన రైతులకు ఏం సమాధానం చెబుతారు? వారి నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారు? రైతులు ఎక్కడైనా పంటలు అమ్ముకొవచ్చని కేంద్రం నిర్ణయం తీసుకుంటే దాన్ని కేసీఆర్​ తప్పుపట్టారు’ అంటూ ఆమె ఫైర్​ అయ్యారు.

First Published:  27 Dec 2020 11:33 PM GMT
Next Story