Telugu Global
NEWS

మీడియా ట్రాప్‌లో వైసీపీ నేతలు పడుతున్నారా?

ఏపీలో ఈ మధ్య ఓ ట్రెండ్‌ మొదలైంది. అనపర్తి నుంచి విశాఖ వరకు ప్రమాణాలు,పంతాలు నడుస్తున్నాయి. ఈ తంతు అసలు ఎలా మొదలైంది? ఎందుకు ఈ టైపు పాలిటిక్స్‌ నడుస్తున్నాయి? అని ఆరా తీస్తే అసలు విషయం తెలిసింది. అనపర్తిలో ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మధ్య వివాదం మొదలైంది. మీడియా నారదుడి పాత్రలో ఎంటరైంది. రామకృష్ణారెడ్డిని ఫస్ట్‌ రెచ్చగొట్టింది. ఆ తర్వాత సూర్యనారాయణరెడ్డి దగ్గరకు వెళ్లింది. అంతే ఆ విషయం పెద్ద రచ్చ రచ్చ […]

మీడియా ట్రాప్‌లో వైసీపీ నేతలు పడుతున్నారా?
X

ఏపీలో ఈ మధ్య ఓ ట్రెండ్‌ మొదలైంది. అనపర్తి నుంచి విశాఖ వరకు ప్రమాణాలు,పంతాలు నడుస్తున్నాయి. ఈ తంతు అసలు ఎలా మొదలైంది? ఎందుకు ఈ టైపు పాలిటిక్స్‌ నడుస్తున్నాయి? అని ఆరా తీస్తే అసలు విషయం తెలిసింది.

అనపర్తిలో ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మధ్య వివాదం మొదలైంది. మీడియా నారదుడి పాత్రలో ఎంటరైంది. రామకృష్ణారెడ్డిని ఫస్ట్‌ రెచ్చగొట్టింది. ఆ తర్వాత సూర్యనారాయణరెడ్డి దగ్గరకు వెళ్లింది. అంతే ఆ విషయం పెద్ద రచ్చ రచ్చ అయింది. ఇక్కడ 500 కోట్ల అవినీతి ఆరోపణలు అంటూ చర్చ జరిగింది. చివరకు తేలింది ఏం లేదు. ఇద్దరు ఎమ్మెల్యేలు గణపతి గుడి దగ్గరకు వెళ్లారు. ఎమ్మెల్యే ప్రమాణం చేశారు. కానీ మాజీ ఎమ్మెల్యే మాత్రం మనఃస్ఫూర్తిగా ప్రమాణంలో పాల్గొనలేకపోయారు. ఇక్కడే ఆ ఆరోపణల విలువ ఏంటో తెలిసిపోయింది.

మరోవైపు విశాఖలో కూడా ఇదే తంతు నడిచింది. టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ సాయిబాబ ఆలయానికి వస్తానని సవాల్ విసిరారు. చివరకు వైసీపీ నేత అమర్‌నాథ్‌ తో పాటు విజయసాయిరెడ్డి వస్తేనే తాను వస్తానని టీడీపీ ఆఫీసులోనే వెలగపూడి ఉండిపోయారు. దీంతో ఇక్కడ ఆయన తగ్గారు అనే విషయం స్పష్టమవుతోంది.

పల్నాడులో ఎమ్మెల్యే కాసు మహేష్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుల మధ్య సవాళ్లు నడిచాయి. పలాసలో గౌతు లచ్చన్న విగ్రహం చుట్టూ రాజకీయం నడిచింది. వరుసగా జరుగుతున్న ఈ ఘటనలు చూస్తే మీడియా ట్రాప్‌లో అధికార పార్టీ నేతలు పడుతున్నారా? అని అన్పిస్తోంది.

వివాదాలు వారే సృష్టించడం… రెండు పార్టీల నేతలు కలవడం… రోజంతా హైప్‌ చేయడం ఇప్పుడు మీడియా చానళ్లలో కన్పిస్తోంది. అయితే దీని వెనుక హిడెన్ అజెండా మాత్రం వైసీపీ నేతలను కార్నర్ చేయడం… వారి గురించి నెగటివ్‌ గా చూపించడం అనేది ఎక్కువగా జరుగుతోంది.

ప్రభుత్వ పథకాలను విమర్శించలేరు. సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి పనితీరును ఏం అనలేరు. అక్కడ అంత ఎత్తిచూపేది ఏం లేదు. దీంతో ఒక్కో నియోజకవర్గం ఎమ్మెల్యేను టార్గెట్‌ చేసుకుని కొన్ని మీడియా సంస్థలు రాజకీయం నడుపుతున్నాయి. కాంట్రవర్సీ అంటూ హైలైట్‌ చేసి తమ పబ్బం గడుపుకుంటున్నాయి. స్వామి కార్యం…స్వకార్యం తీర్చేసుకుంటున్నాయి. రోజంతా నడిచే ఈ డ్రామాల పట్ల వైసీపీ నేతలు అప్రమత్తంగా ఉండకపోతే లాంగ్‌ రన్‌లో పార్టీకి డ్యామేజీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. జగన్‌ ఇమేజ్‌ను డ్యామేజీ చేయలేక పార్టీ లేదా నేతలను ఇలా అప్రతిష్ట పాలు చేసే కార్యక్రమం జరుగుతోంది.

First Published:  27 Dec 2020 8:46 PM GMT
Next Story