Telugu Global
National

రాజకీయాల్లోకి రావడం లేదు " తలైవా సంచలన ప్రకటన

తన రాజకీయ అరంగేట్రంపై తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సంచలన ప్రకటన చేశారు. పార్టీ పెట్టడం లేదంటూ ట్వీట్ చేశారు. పార్టీ ప్రారంభిస్తానని చెప్పి వెనక్కి తగ్గినందుకు ఆయన అభిమానులను క్షమాపణ కోరారు. ఇటీవల రజనీ అనారోగ్యం పాలైన సంగతి తెలిసిందే. రెండు రోజుల కిందటే ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి హైదరాబాద్ నుంచి చెన్నైలోని ఇంటికి చేరుకున్నారు. ఇంటికి వచ్చిన వెంటనే మక్కల్ మండ్రం నేతలు, సన్నిహితులతో సమావేశం అయ్యారు. అనంతరం ఈ నిర్ణయం […]

రాజకీయాల్లోకి రావడం లేదు  తలైవా సంచలన ప్రకటన
X

తన రాజకీయ అరంగేట్రంపై తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సంచలన ప్రకటన చేశారు. పార్టీ పెట్టడం లేదంటూ ట్వీట్ చేశారు. పార్టీ ప్రారంభిస్తానని చెప్పి వెనక్కి తగ్గినందుకు ఆయన అభిమానులను క్షమాపణ కోరారు. ఇటీవల రజనీ అనారోగ్యం పాలైన సంగతి తెలిసిందే. రెండు రోజుల కిందటే ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి హైదరాబాద్ నుంచి చెన్నైలోని ఇంటికి చేరుకున్నారు.

ఇంటికి వచ్చిన వెంటనే మక్కల్ మండ్రం నేతలు, సన్నిహితులతో సమావేశం అయ్యారు. అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. తన ఆరోగ్యం బాగోలేకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని రజనీ మూడు పేజీల సుధీర్ఘ ప్రకటన విడుదల చేశారు.

ఈ నెల 31న తన కొత్త పార్టీకి సంబంధించిన విధి విధానాలు, చిహ్నం, పతాకం తదితర వివరాలు వెల్లడిస్తానని రజనీ కొద్ది రోజుల కిందట ప్రకటించారు. దీంతో రజనీ మక్కల్ మండ్రం నేతలు పార్టీ ఏర్పాట్లు కూడా ముమ్మరం చేశారు. చెన్నై కోడంబాక్కంలోని రాఘవేంద్ర కళ్యాణ మండపాన్ని సిద్ధం చేశారు. పార్టీ ప్రకటించడానికి సంబంధించి పూర్తి వ్యవహారాలు చక్కబెట్టారు. ఈ లోగా పెండింగ్ లో ఉన్న తన తాజా చిత్రం అన్నాత్తే షూటింగ్ ఫినిష్ చేసేందుకు రజనీ హైదరాబాద్ వచ్చారు.

ఇక్కడ సెట్లో కొంతమంది కరోనా బారిన పడటంతో రజనీ కూడా ఐసోలేషన్ కు పరిమితం అయ్యారు. ఆ తర్వాత ఆయన హైబీపీతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. జూబ్లీహిల్స్ లోని అపోలో ఆస్పత్రిలో చేరారు. రజనీ ఆస్పత్రి పాలవడంతో 31న రాజకీయ పార్టీ ప్రకటన ఉంటుందా లేదా అని అప్పుడే సందేహాలు తలెత్తాయి. ఆ తర్వాత మక్కల్ మండ్రం నేతలు, అభిమానులతో సభ నిర్వహించకుండా సోషల్ మీడియా ద్వారా రజనీ కొత్త పార్టీకి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తారని వార్తలు వచ్చాయి.

అయితే రజనీ మాత్రం అభిమానులకు షాక్ ఇచ్చారు. ఇక పార్టీ ప్రారంభించలేనంటూ ప్రకటన చేయడంతో వారు నిరాశలో కూరుకుపోయారు. అయితే రాజకీయ పార్టీ పెట్టొద్దని కుటుంబ సభ్యులు రజనీపై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. ఇప్పుడున్న ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా వైద్యులు సూచించినట్లు, విశ్రాంతి తీసుకోవాలని కోరడంతో పార్టీ ఏర్పాటుపై ఆయన వెనక్కి తగ్గారని తెలుస్తోంది.

First Published:  29 Dec 2020 3:10 AM GMT
Next Story