Telugu Global
National

రైతుల ఆందోళన... అంబానీ టవర్స్‌కు తగిలిన సెగ

పంజాబ్‌లో రైతుల ఆందోళన రోజురోజుకు ఉధృతమవుతోంది. వివిధ రూపాల్లో అన్నదాతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమ బాధలు పట్టించుకోవడం లేదనే కసి రైతుల్లో కనిపిస్తోంది. రైతుల ఆగ్రహావేశాలు ఇప్పుడు టెలికాం కంపెనీలపై పడ్డాయి. పంజాబ్‌లోని 15వందల రిలయన్స్ జియో టవర్లను ధ్వంసం చేశారు. మొత్తం 9 వేల టెలికాం టవర్స్‌కు డ్యామేజీ అయినట్లు తెలుస్తోంది. అంబానీ, అదానీలకి మేలు చేకూర్చేలా కొత్త వ్యవసాయ చట్టాలు ఉన్నాయని సోషల్‌ మీడియాలో ప్రచారంతో రైతుల కోపం టెలికాం టవర్స్‌ పైకి […]

రైతుల ఆందోళన... అంబానీ టవర్స్‌కు తగిలిన సెగ
X

పంజాబ్‌లో రైతుల ఆందోళన రోజురోజుకు ఉధృతమవుతోంది. వివిధ రూపాల్లో అన్నదాతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమ బాధలు పట్టించుకోవడం లేదనే కసి రైతుల్లో కనిపిస్తోంది.

రైతుల ఆగ్రహావేశాలు ఇప్పుడు టెలికాం కంపెనీలపై పడ్డాయి. పంజాబ్‌లోని 15వందల రిలయన్స్ జియో టవర్లను ధ్వంసం చేశారు. మొత్తం 9 వేల టెలికాం టవర్స్‌కు డ్యామేజీ అయినట్లు తెలుస్తోంది. అంబానీ, అదానీలకి మేలు చేకూర్చేలా కొత్త వ్యవసాయ చట్టాలు ఉన్నాయని సోషల్‌ మీడియాలో ప్రచారంతో రైతుల కోపం టెలికాం టవర్స్‌ పైకి మళ్లింది. అంబానీ కంపెనీ జియో టవర్లను టార్గెట్‌ చేశారు. కొన్ని టవర్లను ధ్వంసం చేస్తే…మరికొన్ని టవర్లకు కరెంట్‌ కనెక్షన్లు పీకేశారు. మరికొన్ని టవర్లలో జనరేటర్లను దుండగులు ఎత్తుకెళ్లారు.

రోజురోజుకు టెలికాం టవర్ల ధ్వంసం పెరగడంతో పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌సింగ్‌ పోలీసులకు గట్టి ఆదేశాలు జారీ చేశారు. మొబైల్‌ టవర్లను ధ్వంసం చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల ధ్వంసంను సహించేది లేదని చెప్పారు. శాంతిభద్రతలు అదుపులో ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. టెలికాం టవర్ల ధ్వంసం వల్ల ఆన్‌లైన్‌ క్లాసులు వింటున్న విద్యార్థులు, వర్క్‌ ఫ్రమ్‌ హోంలో ఉన్న ఉద్యోగులు ఇబ్బందులు పడతారని… రైతులు ఆలోచించాలని ముఖ్యమంత్రి అమరీందర్‌ కోరారు.

మరోవైపు కొత్త వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళన 34వ రోజుకు చేరింది. రాబోయే నాలుగు రోజుల్లో ఉత్తరాదిలో భయంకరమైన చలిగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో చర్చలకు రావాలని కేంద్రం కోరింది. దీంతో ఈ నెల 30న చర్చించేందుకు రైతు సంఘాలు అంగీకరించాయి. కొత్త వ్యవసాయ చట్టాలు వెనక్కి తీసుకోవాలనేది తమ ప్రధాన డిమాండ్‌… దానికి అంగీకరించకుంటే ఆందోళన విరమించేది లేదని రైతు సంఘాల నేతలు తేల్చిచెప్పారు.

First Published:  28 Dec 2020 9:12 PM GMT
Next Story