Telugu Global
National

ప్రజాస్వామ్యం బతకాలంటే బీజేపీ పోవాలి..! అఖిలేష్ వ్యాఖ్యలు

ఈ దేశంలో ప్రజాస్వామ్యం బతకాలంటే భారతీయజనతాపార్టీ ఉండొద్దని యూపీ మాజీ సీఎం, ఎస్​పీ అధినేత అఖిలేశ్​ యాదవ్​ వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలు రైతులకు డెత్​ వారెంట్ల వంటివని పేర్కొన్నారు. లక్నో పార్టీ ఆఫీస్​లో అఖిలేశ్​ మీడియాతో మాట్లాడారు. ‘కేంద్ర ప్రభుత్వం, లేదా బీజేపీ పాలిత రాష్ట్రాలు తీసుకుంటున్న నిర్ణయాలు ఎవరైనా తీసుకొంటే వాళ్లను దేశద్రోహులుగా చిత్రీకరిస్తున్నారు. రైతు చట్టాలను వ్యతిరేకించడం దేశద్రోహం ఎలా అవుతుందో అర్థం కావడం లేదు. ఇలా అయితే ఈ దేశంలో […]

ప్రజాస్వామ్యం బతకాలంటే బీజేపీ పోవాలి..! అఖిలేష్ వ్యాఖ్యలు
X

ఈ దేశంలో ప్రజాస్వామ్యం బతకాలంటే భారతీయజనతాపార్టీ ఉండొద్దని యూపీ మాజీ సీఎం, ఎస్​పీ అధినేత అఖిలేశ్​ యాదవ్​ వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలు రైతులకు డెత్​ వారెంట్ల వంటివని పేర్కొన్నారు. లక్నో పార్టీ ఆఫీస్​లో అఖిలేశ్​ మీడియాతో మాట్లాడారు.

‘కేంద్ర ప్రభుత్వం, లేదా బీజేపీ పాలిత రాష్ట్రాలు తీసుకుంటున్న నిర్ణయాలు ఎవరైనా తీసుకొంటే వాళ్లను దేశద్రోహులుగా చిత్రీకరిస్తున్నారు. రైతు చట్టాలను వ్యతిరేకించడం దేశద్రోహం ఎలా అవుతుందో అర్థం కావడం లేదు. ఇలా అయితే ఈ దేశంలో ప్రజాస్వామ్యం అనేది బతకదు. యూపీలో బీజేపీ చేస్తున్న అక్రమాలకు, అన్యాయాలకు అంతులేకుండా పోతోంది. దాన్ని ఎదుర్కొనేందుకు ఎస్​పీ కార్యకర్తలు సమాయత్తం కావాలి. బీజేపీ అక్రమాలను దీటుగా తిప్పికొట్టాలి.

హత్రాస్​ ఘటనపై బీజేపీ ఎన్ని పచ్చి అబద్ధాలు చెప్పిందో చూశాం. ఇక్కడ ప్రజాస్వామ్యం బతకాలంటే బీజేపీ పోవాల్సిందే. రైతులకు ఎంతో మేలు చేస్తున్న మండీలు తీసేస్తామంటున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలను వ్యతిరేకిస్తే దేశద్రోహులుగా చిత్రీకరిస్తున్నారు.

బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్లకు కొమ్ము కాస్తోంది. రైతు చట్టాలు రైతుల పాలిట మరణశాసనాలు.. వాటిని తీసేసేవరకు పోరాటాలు సాగాలి’ అంటూ ఆయన పిలుపునిచ్చారు.

యూపీలో త్వరలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో సమాజ్​వాద్​ పార్టీ దూకుడు పెంచింది. యోగి ఆదిత్యనాథ్​ సీఎం అయ్యాక .. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి ఏమీ లేదని సమాజ్​వాద్​ పార్టీ శ్రేణులు ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి.

First Published:  30 Dec 2020 12:40 AM GMT
Next Story