Telugu Global
NEWS

గ్రేటర్‌ ఎన్నికల ఎఫెక్టేనా... ఉద్యోగులపై కేసీఆర్‌ వరాలు

ఎల్‌ఆర్‌ఎస్‌పై వెనక్కి తగ్గారు. ఉద్యోగాల జీతాల పెంపు ప్రకటన చేశారు, ఉద్యోగాల భర్తీపై ఫోకస్‌ పెట్టారు. పెండింగ్‌ ప్రాజెక్టులపై దృష్టి పెట్టారు. గతం వారం రోజులుగా వరుస సమీక్షలు జరుగుతున్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్‌ మళ్లీ ఏం చేస్తున్నారు? గ్రేటర్‌ ఎఫెక్ట్‌ కేసీఆర్‌పై పడిందా? లేక పాలన పరుగులు పెట్టించే కార్యక్రమమా? ఇది అనే చర్చ నడుస్తోంది. ఎల్‌ఆర్‌ఎస్‌పై రచ్చ నడిచింది. రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. దీంతో పాత ప్లాట్‌ లకు ఎల్‌ఆర్‌ఎస్‌ లేకుండా రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇచ్చారు. […]

గ్రేటర్‌ ఎన్నికల ఎఫెక్టేనా... ఉద్యోగులపై కేసీఆర్‌ వరాలు
X

ఎల్‌ఆర్‌ఎస్‌పై వెనక్కి తగ్గారు. ఉద్యోగాల జీతాల పెంపు ప్రకటన చేశారు, ఉద్యోగాల భర్తీపై ఫోకస్‌ పెట్టారు. పెండింగ్‌ ప్రాజెక్టులపై దృష్టి పెట్టారు. గతం వారం రోజులుగా వరుస సమీక్షలు జరుగుతున్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్‌ మళ్లీ ఏం చేస్తున్నారు? గ్రేటర్‌ ఎఫెక్ట్‌ కేసీఆర్‌పై పడిందా? లేక పాలన పరుగులు పెట్టించే కార్యక్రమమా? ఇది అనే చర్చ నడుస్తోంది.

ఎల్‌ఆర్‌ఎస్‌పై రచ్చ నడిచింది. రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. దీంతో పాత ప్లాట్‌ లకు ఎల్‌ఆర్‌ఎస్‌ లేకుండా రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇచ్చారు. అయితే కొత్త లేఅవుట్లకు మాత్రం అనుమతి ఇవ్వలేదు.

తెలంగాణ ఉద్యోగుల జీతాలు పెంచుతామని ప్రకటించారు. ఇందుకోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌ నేతృత్వంలో కమిటీ వేశారు. ఈ కమిటీ ఉద్యోగ సంఘాలతో చర్చలు జరుపుతోంది. ఆ తర్వాత ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపుతో పాటు..ఉద్యోగుల జీతాలు ఎంత పెంచాలి అనే దానిపై నిర్ణయం తీసుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఆర్టీసీ ఉద్యోగుల జీతాలు కూడా పెంచుతామని సీఎం కేసీఆర్‌ చెప్పారు. ఆర్టీసీ పై భారం పడకుండా ప్రభుత్వం జీతాల పెంపు భారం భరిస్తుందని హామీ ఇచ్చారు.

ఉద్యోగాల భర్తీకి కార్యాచరణ తయారు చేయాలని ఆదేశించారు. ఫిబ్రవరి నుంచి ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్లు జారీ చేయాలని సూచించారు.

మొత్తానికి వరుస నిర్ణయాలతో మళ్లీ కేసీఆర్ ట్రాక్‌లో పడ్డారని టీఆర్‌ఎస్‌ నేతలు సంతోషంగా ఉన్నారు. అయితే ఐకేపీ సెంటర్ల ఎత్తివేత రైతుల్లో వ్యతిరేకతకు దారితీస్తుందని భయపడుతున్నారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతున్నారు.

First Published:  29 Dec 2020 9:56 PM GMT
Next Story