Telugu Global
National

మహారాష్ట్రకు మరో 150 ఎలక్ట్రిక్ బస్సుల సరఫరా కాంట్రాక్ట్ ను దక్కించుకున్న మేఘా

మేఘా అనుబంధ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ పూణే రోడ్డు రవాణా సంస్థకు 150 ఎలక్ట్రిక్ బస్సులను సరఫరా చేసేందుకు అనుమతి లభించింది. ఈ కొత్త ఆర్డర్ తో కలిపి ఒలేక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ ఇప్పటి వరకు 900 ఎలక్ట్రిక్ బస్సులను సరఫరా చేసేందుకు అనుమతి పొందింది. ఇటీవల 353 బస్సుల కోసం మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన బిడ్ లో భాగంగా అతి తక్కువగా కోట్ చేసి మేఘా ఈ 150 బస్సుల ఆర్డర్ ను దక్కించుకుంది. ఈ […]

మహారాష్ట్రకు మరో 150 ఎలక్ట్రిక్ బస్సుల సరఫరా కాంట్రాక్ట్ ను దక్కించుకున్న మేఘా
X

మేఘా అనుబంధ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ పూణే రోడ్డు రవాణా సంస్థకు 150 ఎలక్ట్రిక్ బస్సులను సరఫరా చేసేందుకు అనుమతి లభించింది. ఈ కొత్త ఆర్డర్ తో కలిపి ఒలేక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ ఇప్పటి వరకు 900 ఎలక్ట్రిక్ బస్సులను సరఫరా చేసేందుకు అనుమతి పొందింది. ఇటీవల 353 బస్సుల కోసం మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన బిడ్ లో భాగంగా అతి తక్కువగా కోట్ చేసి మేఘా ఈ 150 బస్సుల ఆర్డర్ ను దక్కించుకుంది.

ఈ సందర్భంగా ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ (ఓజీఎల్) సీఈఓ & సీఎఫ్ఓ శరత్ చంద్ర మాట్లాడుతూ పూణే మహానగర్ పరివహన్ మహామండల్ లిమిటెడ్ నుండి 150 ఎలెక్ట్రిక్ బస్సుల ఆర్డర్ దక్కించుకున్నందుకు చాలా సంతోషం. ఎవీ ట్రాన్స్ ద్వారా ఇప్పటికే పూణేలో 150 ఎలెక్ట్రిక్ బస్సులను నడుపుతున్నాం. ఈ కొత్త బస్సుల సరఫరాతో దీని సంఖ్య ఇప్పుడు 300 లకు చేరుతుంది. ఇది దేశంలోనే అత్యధికం. ఒలెక్ట్రా గ్రీన్ టెక్ బృందానికి చాలా గర్వంగా ఉంది అని తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

12 మీటర్ల పొడవు ఉన్న ఈ ఏసీ బస్సులో డ్రైవర్, 33 మంది ప్రయాణికుల సీటింగ్ సామర్థ్యంతో పాటు వీల్ చెయిర్ సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ బస్సులో ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్ నియంత్రిత ఎయిర్ సస్పెన్షన్ తో ప్రయాణికులు సౌకర్యవంతమైన ప్రయాణం చేయవచ్చు. ప్రయాణికుల రక్షణ కోసం బస్సులో సీసీటీవీలను ఏర్పాటు చేశారు. అలాగే వికలాంగులు, వృద్ధులకు ఇబ్బంది లేకుండా బస్సులో వీల్ చెయిర్ ర్యాంప్, ఎమర్జెన్సీ బటన్, యూఎస్ బీ సాకెట్ ను కూడా ఏర్పాటు చేశారు. బస్సులో అమర్చిన లిథియమ్-ఇయాన్ బ్యాటరీని ఒకసారి చార్జ్ చేస్తే దాదాపు 200 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు.

ఈ అత్యాధునిక సాంకేతిక ఎలక్ట్రిక్ బస్సులో ఉన్న ప్రత్యేకమైన రీజెనరేటివ్ బ్రేకింగ్ సిస్టం ద్వారా ప్రయాణంలో ప్రతిసారి బ్రేక్ వేసినప్పుడు కోల్పోయిన చార్జింగ్ ను కొంతమేరకు తిరిగి పొందుతుంది. ఇందులో ఉన్న అతి శక్తివంతమైన ఏసీ చార్జింగ్ వ్యవస్థ ద్వారా బ్యాటరీ 2 నుంచి 5 గంటల్లో మొత్తం చార్జింగ్ అవుతుంది.

మెయిల్ అనుబంధ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్

మెయిల్ అనుబంధ సంస్థ అయిన ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ సంస్థను 2000లో స్థాపించారు. ఇది ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. 2015 లోనే దేశంలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టిన సంస్థ. విద్యుత్ ప్రసారం, పంపిణీ నెట్‌వర్క్‌ల కోసం సిలికాన్ రబ్బరు, కంపోసిట్ ఇన్స్ లేటర్స్ తయారుచేసే అతిపెద్ద సంస్థ ఇది.

భారత ప్రభుత్వ ఫేమ్-2 పథకంలో భాగంగా ఈ బస్సులను సరఫరా చేస్తున్నారు. కాంట్రాక్ట్ కాలంలో ఈ బస్సుల నిర్వహణ బాధ్యత కూడా మేఘా సంస్థే చూసుకుంటుంది.

First Published:  30 Dec 2020 6:44 AM GMT
Next Story