Telugu Global
National

రజినీ మాకు మద్దతివ్వు ప్లీజ్... పార్టీల క్యూ

ఏళ్ళకేళ్ళు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు తటపటాయిస్తూ వచ్చిన తమిళ సూపర్ స్టార్ రజినీ కాంత్ ఎలాగోలా కుండబద్దలు కొట్టారు. తానిక రాజకీయాల్లోకి రాలేనని.. అభిమానులు మన్నించాలని కోరారు. ఇక రజినీ బరిలోనుంచి తప్పుకోవడంతో నిన్నటిదాకా ఆయనపై విమర్శలు చేసిన పార్టీలు ప్రస్తుతం రజినీని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి. అలా అయినా కాసిన్ని ఓట్లు పడతాయి కదా అని భావిస్తున్నాయి. ఆయన మద్దుతు పొందటం ఎలా అని వ్యూహ రచన చేస్తున్నాయి. రజినీ రాజకీయాల్లోకి రానని ప్రకటించగానే […]

రజినీ మాకు మద్దతివ్వు ప్లీజ్... పార్టీల క్యూ
X

ఏళ్ళకేళ్ళు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు తటపటాయిస్తూ వచ్చిన తమిళ సూపర్ స్టార్ రజినీ కాంత్ ఎలాగోలా కుండబద్దలు కొట్టారు. తానిక రాజకీయాల్లోకి రాలేనని.. అభిమానులు మన్నించాలని కోరారు. ఇక రజినీ బరిలోనుంచి తప్పుకోవడంతో నిన్నటిదాకా ఆయనపై విమర్శలు చేసిన పార్టీలు ప్రస్తుతం రజినీని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి. అలా అయినా కాసిన్ని ఓట్లు పడతాయి కదా అని భావిస్తున్నాయి. ఆయన మద్దుతు పొందటం ఎలా అని వ్యూహ రచన చేస్తున్నాయి.

రజినీ రాజకీయాల్లోకి రానని ప్రకటించగానే ముందుగా మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ స్పందించారు. రజినీ చేసిన ప్రకటనతో తాను నిరాశ చెందినట్లు కమల్ వ్యాఖ్యానించారు. అయితే ఆయన రాజకీయాల్లోకి రావడం కన్నా.. ఆరోగ్యంగా ఉండటమే తనకెంతో ముఖ్యమని అన్నారు. ప్రచారం ముగియగానే రజినీని కలుస్తానని చెప్పారు.
“నా రజినీ క్షేమంగా ఉండాలి. ఎక్కడ ఉన్నా ఆయన బాగుండాలి” అని అన్నారు. కమల్ చేసిన ప్రకటన బాగా గమనిస్తే రజినీపై ఒకింత ప్రేమ ఒలకబోసినట్లుగానే ఉంది. పైగా ప్రచారం అవగానే రజినీతో భేటీ అవుతానని కమల్ ప్రకటించారు.

ఇక నిన్న మొన్నటి వరకు అన్నాడీఎంకే నాయకులు రజినీ పై తీవ్ర విమర్శలు చేస్తూ వచ్చారు. రజినీ ఇక రాజకీయాల్లోకి రానని చెప్పడంతో అన్నాడీఎంకే స్వరం కూడా మారింది. ఆ పార్టీ సీనియర్ నాయకుడు మాఫోయ్ పాండ్యరాజన్ మాట్లాడుతూ రజినీ రాజకీయాలపై తీసుకున్న నిర్ణయం స్వాగతిస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో ఎమ్జీఆర్ పాలన కొనసాగాలని ఆకాంక్షిస్తూ ప్రకటన చేయాలనీ… ఆయన రజినీకాంత్ ని కోరారు. పరోక్షంగా అన్నాడీఎంకేకు మద్దతు ఇవ్వాలని విన్నవించారు.

టీఎన్సీసీ అధ్యక్షుడు కేఎస్ అళగిరి మాట్లాడుతూ రజినీని రాజకీయాల్లోకి లాగి అన్నాడీఎంకే ఓట్లను తమ సొంతం చేసుకునేందుకు బీజీపీ కుట్ర పన్నిందని, కానీ దీని నుంచి రజినీ బయట పడ్డారంటూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

ఓ మంచి పార్టీకి మద్దతు ఇవ్వాలని తమిళ మానిల కాంగ్రెస్ నాయకుడు జీకే ముపనార్ రజినీకి విజ్ఞప్తి చేశారు. దేశ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని బీజేపీకి మద్దతు ఇవ్వాలని ఆ పార్టీ నాయకుడు ఇల గణేషన్ కోరారు.

ఇలా అన్ని పార్టీల నాయకులు రజినీని ప్రసన్నం చేసుకుని ఆయన మద్దతు పొందటం ద్వారా అభిమానుల కంట్లో పడేందుకు ప్రయత్నిస్తున్నాయి. మరి రజినీ ఎవరికైనా మద్దతు ప్రకటిస్తారా లేక మిన్నకుండి పోతారా అని తమిళనాట చర్చించుకుంటున్నారు.

First Published:  30 Dec 2020 3:18 AM GMT
Next Story