Telugu Global
National

మేఘా వల్ల బీహెచ్ఈఎల్ కు తెలుగు రాష్ట్రాలనుంచి భారీ వర్క్‌ ఆర్డర్‌

దేశంలోనే నీటి పారుదల ప్రాజెక్ట్ ల నిర్మాణ సామగ్రి సరఫరాలో పేరెన్నికగన్న జాతీయ సంస్థ బీహెచ్ఈఎల్ కు తెలుగు రాష్ట్రాలనుంచి మరింత ప్రతిష్టాకరమైన వర్క్ ఆర్డర్ లభించింది. 3,200 కోట్ల రూపాయల పనులను రాబోయే రోజుల్లో బీహెచ్ఈఎల్ చేపట్టేందుకు సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్ లో ప్రతిష్టాత్మక జలవిద్యుత్ ప్రాజెక్ట్ లతోపాటు, తెలంగాణలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ల నిర్మాణంలో బీహెచ్ఈఎల్ భాగస్వామ్యం కాబోతోంది. ప్రముఖ నిర్మాణ రంగ సంస్థ మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ లిమిటెడ్ […]

మేఘా వల్ల బీహెచ్ఈఎల్ కు తెలుగు రాష్ట్రాలనుంచి భారీ వర్క్‌ ఆర్డర్‌
X

దేశంలోనే నీటి పారుదల ప్రాజెక్ట్ ల నిర్మాణ సామగ్రి సరఫరాలో పేరెన్నికగన్న జాతీయ సంస్థ బీహెచ్ఈఎల్ కు తెలుగు రాష్ట్రాలనుంచి మరింత ప్రతిష్టాకరమైన వర్క్ ఆర్డర్ లభించింది. 3,200 కోట్ల రూపాయల పనులను రాబోయే రోజుల్లో బీహెచ్ఈఎల్ చేపట్టేందుకు సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్ లో ప్రతిష్టాత్మక జలవిద్యుత్ ప్రాజెక్ట్ లతోపాటు, తెలంగాణలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ల నిర్మాణంలో బీహెచ్ఈఎల్ భాగస్వామ్యం కాబోతోంది.

ప్రముఖ నిర్మాణ రంగ సంస్థ మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ లిమిటెడ్ ద్వారా ఈ వర్క్ ఆర్డర్ లు బీహెచ్ఈఎల్ కు లభించినట్టు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఏపీలో ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్ట్ లో జలవిద్యుత్ ఉత్పత్తికి సంబంధించి కల్పన్ హైడ్రో టర్బైన్స్ అనే భారీ యంత్ర సామగ్రిని బీహెచ్ఈఎల్ సరఫరా చేస్తుంది. ఏపీ జెన్ కో ఆధ్వర్యంలో ఈ జలవిద్యుత్ ప్రాజెక్ట్ నిర్వహణ జరగబోతోంది.

ఇక తెలంగాణకు సంబంధించి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనులకు అవసరమైన సామగ్రిని బీహెచ్ఈఎల్ సంస్థ అందివ్వబోతోంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ కి సంబంధించి 15 భారీ పంప్ మోటర్ సెట్స్, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 13 సెట్స్ అందించబోతోంది బీహెచ్ఈఎల్. పాలమూరు రంగారెడ్డి ప్యాకేజీ 5, 8లో భాగంగా మరో 18 భారీ పంపు సెట్లను కూడా ఇదే సంస్థ అందించనుంది.

ఏపీలో జలవిద్యుత్ ప్రాజెక్ట్, తెలంగాణలో ఎత్తిపోతల ప్రాజెక్ట్ లకు సంబంధించి యంత్ర సామగ్రి తయారీ, సరఫరా, నిర్వహణ, మరమ్మతులు.. వంటి పనులన్నీ బీహెచ్ఈఎల్ కే అప్పగించారు. వీటికి సంబంధించి యంత్ర సామగ్రి తయారీ మొత్తం భోపాల్, ఝాన్సీ, రుద్రపూర్, బెంగళూరు ప్రాంతాల్లో జరుగుతుంది.

ప్రస్తుతం ఏపీలోని భారీ నీటిపారుదల ప్రాజెక్ట్ లలో 72శాతం యంత్ర సామగ్రిని బీహెచ్ఈఎల్ అందించింది. తెలంగాణలో 44శాతం సామగ్రి బీహెచ్ఈఎల్ తయారు చేసి సరఫరా చేసిందే. దేశవ్యాప్తంగా చూస్తే.. జల విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన రంగంలో 45శాతం పనులు బీహెచ్ఈల్ ద్వారా జరిగినవే. దేశంలో వినియోగంలో ఉన్న మొత్తం 500 హైడ్రో ఎలక్ట్రిక్ సెట్ లను బీహెచ్ఈఎల్ తయారు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం బీహెచ్ఈఎల్ సారధ్యంలో 30వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ఇంత ప్రతిష్టాత్మకమైన సంస్థకు.. తెలుగు రాష్ట్రాల్లో మరింత ప్రతిష్టాత్మక పనులను మెగా నిర్మాణ సంస్థ అందించింది.

First Published:  31 Dec 2020 9:55 AM GMT
Next Story