Telugu Global
National

అనవసర రాద్దాంతంపై హైకోర్టు కీలక వ్యాఖ్య

రాజకీయ పార్టీలు కొన్నిసార్లు అనవసరపు రాద్దాంతం చేస్తుంటాయి. ప్రజా సమస్యలపై కంటే భావోద్వేగాలను రెచ్చగొట్టడంపైనే ఎక్కువ పట్టింపును కనబరుస్తుంటాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షాలు అలాంటి ప్రయత్నమే చేసి విఫలమయ్యాయి. తిరుమల డిక్లరేషన్ విషయంలో ప్రతిపక్షాలు చేసిన రాద్దాంతం అంతా ఇంత కాదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల సందర్శన సందర్భంగా డిక్లరేషన్ ఇవ్వలేదంటూ నానా యాగి చేశాయి. కానీ ఇప్పుడు న్యాయస్థానం ఈ వివాదానికి తెర దించింది. తిరుమల డిక్లరేషన్ విషయంలో కీలక తీర్పును వెల్లడించింది. ముఖ్యమంత్రి […]

అనవసర రాద్దాంతంపై హైకోర్టు కీలక వ్యాఖ్య
X

రాజకీయ పార్టీలు కొన్నిసార్లు అనవసరపు రాద్దాంతం చేస్తుంటాయి. ప్రజా సమస్యలపై కంటే భావోద్వేగాలను రెచ్చగొట్టడంపైనే ఎక్కువ పట్టింపును కనబరుస్తుంటాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షాలు అలాంటి ప్రయత్నమే చేసి విఫలమయ్యాయి. తిరుమల డిక్లరేషన్ విషయంలో ప్రతిపక్షాలు చేసిన రాద్దాంతం అంతా ఇంత కాదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల సందర్శన సందర్భంగా డిక్లరేషన్ ఇవ్వలేదంటూ నానా యాగి చేశాయి. కానీ ఇప్పుడు న్యాయస్థానం ఈ వివాదానికి తెర దించింది. తిరుమల డిక్లరేషన్ విషయంలో కీలక
తీర్పును వెల్లడించింది.

ముఖ్యమంత్రి హోదాలో అధికారిక పర్యటన చేసేటప్పుడు డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని హైకోర్టు రూలింగ్ ఇచ్చింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారిక హోదాలోనే శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించినందున ఆయన డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరంలేదంటూ స్పష్టం చేసింది. ఈ విషయంలో కోర్టును ఆశ్రయించిన పిటీషనర్ ముఖ్యమంత్రి క్రిస్టియన్ అని నిరూపించలేకపోయారని, చర్చిలో ప్రార్థనలు చేసినంత మాత్రాన క్రిస్టియన్ అనడం సరైంది కాదని కోర్టు వ్యాఖ్యానించింది. ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడ కనకదుర్గ ఆలయంలోనూ పట్టు వస్త్రాలు సమర్పించారని, గురుద్వారాలోనూ ప్రార్థనలు చేశారని, అంతమాత్రం చేత ముఖ్యమంత్రిని ఒక మతానికి పరిమితం చేయడం ఏంటని ప్రశ్నించింది. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటీషన్ ను కోర్టు కొట్టివేసింది. అదే సమయంలో వ్యక్తిగత హోదాలో తిరుమలన సందర్శిస్తే పరిస్థితి వేరు అని వ్యాఖ్యానించింది.

హైకోర్టు తీర్పుతో ప్రతిపక్షాలకు నోరుమెదపలేని స్థితి ఎదురైందనే చెప్పాలి. నిజానికి తిరుమల డిక్లరేషన్ అనేది రాజకీయ పార్టీలు భుజానేసుకోవల్సినంత పెద్ద విషయం కాదు. మత విశ్వాసమనేది వ్యక్తిగతమైన విషయం. కానీ రాజకీయ పార్టీలు దానిని ఓటు బ్యాంకుగా వినియోగించుకుంటూ ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టేందుకు యత్నిస్తుంటాయి. తిరుమల డిక్లరేషన్ విషయంలోనూ ప్రతిపక్షాలు అలాంటి ప్రయత్నమే చేశాయి. నిజానికి గతంలో కూడా తిరుమల డిక్లరేషన్ విషయం పలుమార్లు చర్చనీయాంశంగా మారింది. వేరు వేరు మతాల వారు తిరుమలను సందర్శించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అయినా…. మతాల మధ్య దూరాన్ని పెంచే నిబంధనలకు ప్రజాస్వామ్యంలో చోటు ఉండదు. కానీ పార్టీలు మాత్రం మతాల పేరుతోనే రాజకీయాలు చేస్తుంటాయి.

ప్రజా సమస్యలను పక్కన పెట్టి మతరాజకీయాల చుట్టూ తిరగడం వల్ల ప్రజలకు పార్టీలపై ఉన్న విశ్వాసం సన్నగిల్లుతుంది తప్ప పెరగదు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం పార్టీలు ఆడే రాజకీయ చదరంగంలో ప్రజలు పావులుగా మారడం ఎంతమేరకూ హర్షించతగింది కాదు. తిరుమల డిక్లరేషన్ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు ఇప్పటికైనా రాజకీయ పార్టీలకు కన్నువిప్పుగా మారగలిగితే భవిష్యత్తులో ఇలాంటి అనవసరపు రాద్దాంతాలు రాజుకోకుండా ఉంటాయి. పార్టీలు ప్రజా సమస్యల పట్ల దృష్టిసారించడం వల్ల ఎంతోకొంత ప్రజలకు మేలుజరుగుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

First Published:  1 Jan 2021 7:05 AM GMT
Next Story