Telugu Global
National

ముందు త‌మ్ముణ్ణి బీజేపీలోకి.. కాంగ్రెస్‌కు కోమ‌టిరెడ్డి వార్నింగ్‌

వరుస వైఫల్యాలతో కుదేలైన కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఓ వైపు నాయకత్వ కొరత, మరోవైపు అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతున్న పార్టీ రోజు రోజుకూ మరింత బలహీనపడుతోంది. టీపీసీసీ అధ్యక్ష పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయడంతో ఆ పార్టీని నడిపించే నాయకుడు కరువయ్యారు. మరోవైపు రోజుకో నేత కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెబుతున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సైతం అల్విదా బాటపట్టారు. తాను త్వరలోనే బీజేపీలో చేరుతానంటూ కుండ […]

ముందు త‌మ్ముణ్ణి  బీజేపీలోకి..  కాంగ్రెస్‌కు కోమ‌టిరెడ్డి వార్నింగ్‌
X

వరుస వైఫల్యాలతో కుదేలైన కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఓ వైపు నాయకత్వ కొరత, మరోవైపు అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతున్న పార్టీ రోజు రోజుకూ మరింత బలహీనపడుతోంది. టీపీసీసీ అధ్యక్ష పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయడంతో ఆ పార్టీని నడిపించే నాయకుడు కరువయ్యారు. మరోవైపు రోజుకో నేత కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెబుతున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సైతం అల్విదా బాటపట్టారు. తాను త్వరలోనే బీజేపీలో చేరుతానంటూ కుండ బద్ధలుకొట్టారు.

తెలంగాణలో బీజేపీ బలపడడం, కాంగ్రెస్ బలహీనపడడం ఏకకాలంలో జరుగుతున్నాయి. దుబ్బాక ఉప ఎన్నిక విజయంతో దూకుడు పెంచిన బీజేపీ, గ్రేటర్ ఫలితాలతో మరింత జోష్ నింపుకుంది. తెలంగాణలో అధికార పార్టీకి తామే ప్రత్యామ్నాయమని ప్రకటించుకుంది. అన్నట్లుగానే టీఆర్ఎస్ తో తలపడుతోంది. కానీ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ మాత్రం ఉనికిని కూడా చాటులేకపోతోంది. ఎన్నికల్లో కాదు… ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడంలోనూ కాంగ్రెస్ పార్టీ వైఫల్యం చెందిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ఈ విషయాన్ని ముందే గమనించిన కొందరు నేతలు ఇప్పటికే పార్టీని వీడి బీజేపీ
గూటికి చేరారు.

డీకే అరుణ, విజయశాంతి బీజేపీ గూటికి చేరగా, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి సైతం కాషాయ కండువా కప్పుకుంటాడనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి త్వరలోనే తాను బీజేపీలో చేరనున్నట్లు ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీకి బలమున్న ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రాజగోపాల్ రెడ్డి కీలక నేత. అలాంటి నేత కాంగ్రెస్ పార్టీని వీడడం వల్ల ఆ ప్రభావం పార్టీపై తప్పక ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. నిజానికి రాజగోపాల్ రెడ్డి చాలా కాలంగా బీజేపీకి అనుకూలంగా మాట్లాడుతున్నారు. 2019లోనే ఆయన బీజేపీలో చేరుతారనే ప్రచారం జరిగింది. ఎట్టకేలకు ఆయన నోటినుంచే ఆ విషయాన్ని స్పష్టం చేశారు. పనిలో పనిగా కేసీఆర్ వైఖరిపైన విమర్శలూ గుప్పించారు. ప్రజాస్వామ్యంలో ఒంట్టెదు పోకడలు చెల్లవని, తాను నిర్ణయాలను పున: సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.

ఓవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన టీపీసీసీ చీఫ్ స్థానాన్ని భర్తీ చేయడంపై అధిష్టానం దృష్టిసారించింది. సమర్థవంతమైన నేతకు పగ్గాలు అప్పగించడం ద్వారా పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని యోచిస్తోంది. త్వరలో జరగబోయే నాగార్జున సాగర్ ఉప ఎన్నికలోనూ అధికార పార్టీని ఢీకొట్టడానికి కొత్త నాయకత్వం ఉపకరిస్తుందని అధిష్టానం భావిస్తోంది. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడనుండడం పెద్ద దెబ్బే. కాగా టీపీసీసీ రేసులో ఉన్న తన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బీజేపీలో చేరే అవకాశం లేదని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. ఒకరకంగా చావుతప్పి కన్నలొట్టబోవడం లాంటిదే ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి. మొత్తానికి కొత్త టీపీసీసీ నాయకత్వమైనా కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తెస్తుందో లేదో చూడాలి మరి.

First Published:  1 Jan 2021 2:34 AM GMT
Next Story