Telugu Global
National

ఏపీలో మత రాజకీయాలకు బీజం పడుతోందా..?

ఏపీ రాజకీయాలు విగ్రహాల చుట్టూ తిరుగుతున్నాయి. రాష్ట్రంలో రోజుల వ్యవధిలో జరిగిన రెండు విగ్రహాల విధ్వంస ఘటనలు పరిస్థితిని క్లిష్టంగా మార్చాయి. విజయనగరం జిల్లా ఘటన మరవకముందే, రాజమండ్రిలో జరిగిన ఉదంతం మరింత రచ్చకు దారి తీసింది. గతంలో జరిగిన విషయాలన్నీ ఇప్పుడు మరోసారి తెరపైకి తెస్తూ ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో ప్రభుత్వంపై మండిపడుతున్నాయి. రథాలు దగ్ధం అయినప్పుడే కఠిన చర్యలు తీసుకుని ఉంటే.. ఇప్పుడిలాంటి పరిస్థితులు వచ్చేవి కావని, కావాలనే హిందువుల మనోభావాలు దెబ్బతీసేందుకు దేవాలయాలపై […]

ఏపీలో మత రాజకీయాలకు బీజం పడుతోందా..?
X

ఏపీ రాజకీయాలు విగ్రహాల చుట్టూ తిరుగుతున్నాయి. రాష్ట్రంలో రోజుల వ్యవధిలో జరిగిన రెండు విగ్రహాల విధ్వంస ఘటనలు పరిస్థితిని క్లిష్టంగా మార్చాయి. విజయనగరం జిల్లా ఘటన మరవకముందే, రాజమండ్రిలో జరిగిన ఉదంతం మరింత రచ్చకు దారి తీసింది. గతంలో జరిగిన విషయాలన్నీ ఇప్పుడు మరోసారి తెరపైకి తెస్తూ ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో ప్రభుత్వంపై మండిపడుతున్నాయి. రథాలు దగ్ధం అయినప్పుడే కఠిన చర్యలు తీసుకుని ఉంటే.. ఇప్పుడిలాంటి పరిస్థితులు వచ్చేవి కావని, కావాలనే హిందువుల మనోభావాలు దెబ్బతీసేందుకు దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని అంటున్నారు ప్రతిపక్ష నేతలు. చంద్రబాబు విజయనగరం జిల్లా పర్యటనకు సిద్ధమయ్యారు కూడా. బీజేపీ సంగతి సరే సరి. వైసీపీ హయాంలో దేవాలయాలపై దాడులు పెరిగిపోతున్నాయని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. ఇతర మతాలకు అత్యంత ప్రాముఖ్యతనిస్తూ హిందూ ఆలయాల ఆదాయాన్ని దారి మళ్లిస్తున్నారంటూ గతంలో పలు ఆరోపణలు చేసిన బీజేపీ.. తాజా ఘటనలకు మరింత రాజకీయ రంగు పులుముతోంది. ఇటీవల కాలంలో పూర్తిగా బీజేపీ టర్న్ తీసుకున్న జనసేనాని పవన్ కల్యాణ్ కూడా విగ్రహాల విషయంలో ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమేనంటూ మండిపడ్డారు.
మరోవైపు ప్రభుత్వం మాత్రం ఈ నిందను ప్రతిపక్షాలపై వేసింది. రాష్ట్రంలో మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకే ప్రతిపక్షాలు ఇలాంటి పనులు చేయిస్తున్నాయని అంటున్నారు వైసీపీ నేతలు. విజయనగరం జిల్లా రామతీర్థం ఘటన వెనక చంద్రబాబు హస్తం ఉందంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. దీంతో అటు టీడీపీ వైపునుంచి కూడా ప్రతి విమర్శలు మొదలయ్యాయి. చంద్రబాబు హస్తం ఉందని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, ఆ విషయంపై తాము ప్రమాణానికి సిద్ధం అని ప్రకటించారు నారా లోకేష్. సింహాద్రి అప్పన్న సన్నిధిలో ప్రమాణం చేద్దాం.. జగన్ వస్తారా అంటూ ప్రశ్నించారు.
మొత్తమ్మీద రాష్ట్రంలో జరుగుతున్న వరుస ఘటనలు.. రాజకీయ వేడిని పుట్టించాయి. ఇన్నాళ్లూ కులాల కుంపట్లుగా ఉన్న ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా మతం రంగు పులుముకుంటున్నాయనే అనుమానం బలపడుతోంది. మతరాజకీయాలకు బీజం పడే అవకాశం కనిపిస్తోంది.

First Published:  1 Jan 2021 9:03 PM GMT
Next Story