Telugu Global
National

వ్యాక్సిన్ చుట్టూ రాజకీయ దుమారం..

కొవి షీల్డ్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి నిపుణుల కమిటీ అనుమతిచ్చిన గంటల వ్యవధిలోనే.. రాజకీయ దుమారం రేగింది. సాక్షాత్తూ అధికార పార్టీ నేత, రాజ్యసభ సభ్యులు సుబ్రహ్మణ్య స్వామి వ్యాక్సిన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా సంస్థ సంయుక్తంగా అభివృద్ధి చేసిన కొవిషీల్డ్ టీకా అత్యవసర వినియోగానికి నిపుణుల కమిటీ అనుమతినివ్వడాన్ని ఆయన పరోక్షంగా తప్పుబట్టారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఇంకా కొవిషీల్డ్ టీకా అత్యవసర వినియోగానికి అనుమతివ్వలేదని, అలాంటిది […]

వ్యాక్సిన్ చుట్టూ రాజకీయ దుమారం..
X

కొవి షీల్డ్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి నిపుణుల కమిటీ అనుమతిచ్చిన గంటల వ్యవధిలోనే.. రాజకీయ దుమారం రేగింది. సాక్షాత్తూ అధికార పార్టీ నేత, రాజ్యసభ సభ్యులు సుబ్రహ్మణ్య స్వామి వ్యాక్సిన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా సంస్థ సంయుక్తంగా అభివృద్ధి చేసిన కొవిషీల్డ్ టీకా అత్యవసర వినియోగానికి నిపుణుల కమిటీ అనుమతినివ్వడాన్ని ఆయన పరోక్షంగా తప్పుబట్టారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఇంకా కొవిషీల్డ్ టీకా అత్యవసర వినియోగానికి అనుమతివ్వలేదని, అలాంటిది భారత్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడాన్ని ఆయన వేలెత్తి చూపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం అనుమతివ్వని వ్యాక్సిన్ ని భారత్ లో వినియోగించడానికి భారతీయులందరూ ‘గినియా పిగ్స్’ లా కనిపిస్తున్నారా అని ప్రశ్నించారు సుబ్రహ్మణ్య స్వామి. గినియా పిగ్స్ అనే ఎలుక జాతిని మందుల ప్రయోగాలకోసం వినియోగిస్తుంటారు. అంటే భారతీయులపై ఈ వ్యాక్సిన్ పేరుతో ప్రయోగాలు జరుగుతున్నాయనేది ఆయన ఉద్దేశంగా స్పష్టమవుతోంది. రాజకీయ నాయకులెవరూ సుబ్రహ్మణ్య స్వామి వ్యాఖ్యలపై స్పందించలేదు కానీ, నెటిజన్లు మాత్రం ఆయనపై మండిపడుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతివ్వాల్సిన అవసరం ఏముందని, భారత్ కు చెందిన సీరం ఇన్ స్టిట్యూట్ సత్తాని ఆయన అనుమానిస్తున్నారా అని ప్రశ్నిస్తున్నారు.

అది బీజేపీ టీకా..
ఇక యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు కూడా తీవ్ర దుమారం రేపాయి. భారత్ లో అత్యవసర వినియోగానికి అనుమతి పొందిన కరోనా వ్యాక్సిన్ ని తాను తీసుకోబోనని, అది బీజేపీ వ్యాక్సిన్ అని, దాన్ని తాను నమ్మబోమంటూ సెటైర్లు వేశారు. యూపీలో తాము అధికారంలోకి వచ్చాక వ్యాక్సిన్ ని ఉచితంగా పంపిణీ చేస్తామని చెప్పుకొచ్చారు. అయితే బీజేపీ వ్యాక్సిన్ అంటూ అఖిలేష్ చేసిిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారం రేపాయి. అఖిలేశ్‌ వ్యాఖ్యలను బీజేపీ నేత, యూపీ డిప్యూటీ సీఎం కేశవ్‌ ప్రసాద్‌ ఖండించారు. వ్యాక్సిన్‌ పై వ్యాఖ్యలు చేయడం ద్వారా డాక్టర్లను, సైంటిస్టులను ఆయన అవమానిస్తున్నారని అన్నారు. అఖిలేశ్‌ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.
మొత్తమ్మీద భారత్ లో వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతి వచ్చిందని ప్రజలు సంబరపడుతుంటే.. రాజకీయ వర్గాల్లో మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు కొవిషీల్డ్ తోపాటు, భారత తయారీ కొవాక్సిన్ కి కూడా.. కేంద్ర నిపుణుల కమిటీ అత్యవసర అనుమతినిచ్చింది. భారత్ బయోటెక్ సంస్థ కొవాక్సిన్ ని తయారు చేస్తోంది. ప్రస్తుతం ఈ టీకా మూడో దశ ప్రయోగాలలో ఉంది.

First Published:  2 Jan 2021 9:40 PM GMT
Next Story