Telugu Global
Cinema & Entertainment

విజయ్ ఆంటోనీ మరో యాక్షన్ మూవీ

నకిలీ, డా.సలీమ్‌, బిచ్చగాడు, భేతాళుడు, ఇంద్రసేన, రోషగాడు, కిల్లర్‌ వంటి చిత్రాలతో టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సంపాదించుకున్న హీరో విజయ్‌ ఆంటోని. ఈయన హీరోగా.. మెట్రో వంటి డిఫరెంట్‌ మూవీని తెరకెక్కించిన ఆనంద కృష్ణన్‌ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘విజయ రాఘవన్‌’. ఇన్ఫినిటీ ఫిల్మ్‌ వెంచర్‌ సమర్పణలో చెందూర్ ఫిల్మ్‌ ఇంటర్నేషనల్‌ బ్యానర్‌పై టి.డి.రాజా, డి.ఆర్‌.సంజయ్‌ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కొత్త ఏడాదిని పురస్క‌రించుకుని ఈ సినిమా టీజ‌ర్‌ను యూనిట్ విడుద‌ల చేసింది. […]

Vijay-raghavan
X

నకిలీ, డా.సలీమ్‌, బిచ్చగాడు, భేతాళుడు, ఇంద్రసేన, రోషగాడు, కిల్లర్‌ వంటి చిత్రాలతో టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సంపాదించుకున్న హీరో విజయ్‌ ఆంటోని. ఈయన హీరోగా.. మెట్రో వంటి డిఫరెంట్‌ మూవీని తెరకెక్కించిన ఆనంద కృష్ణన్‌ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘విజయ రాఘవన్‌’. ఇన్ఫినిటీ ఫిల్మ్‌ వెంచర్‌ సమర్పణలో చెందూర్ ఫిల్మ్‌ ఇంటర్నేషనల్‌ బ్యానర్‌పై టి.డి.రాజా, డి.ఆర్‌.సంజయ్‌ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కొత్త ఏడాదిని పురస్క‌రించుకుని ఈ సినిమా టీజ‌ర్‌ను యూనిట్ విడుద‌ల చేసింది.

‘‘ఎవ‌డ‌య్యా వాడు అని ఓ వాయిస్ అడిగిన‌ ప్ర‌శ్న‌కు… పేరు విజ‌య రాఘ‌వ‌న్ అండి.. మా ఏరియా ట్యూష‌న్ మాస్ట‌ర్’’ అని హీరో ఇంట్రడ‌క్షన్‌తో టీజ‌ర్ మొద‌లైంది. విల‌న్స్, వాళ్ల‌తో హీరో విజ‌య్ ఆంటోని ఫైట్‌, పాట‌ల్లో స్టెప్పులేయ‌డం వంటి స‌న్నివేశాల‌తో పాటు ‘విజయ రాఘవన్..విజయానికే నాయకన్’ అనే సాంగ్ బ్యాగ్రౌండ్‌గా టీజర్ ఉంది.

ఇది వరకు విజయ్ ఆంటోని చేసిన చిత్రాలకు ఢిఫరెట్‌గా ‘విజయ్ రాఘవన్’ సినిమా ఉంటుందని టీజర్ చూస్తే అర్థమవుతుంది. త్వరలోనే ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయబోతున్నారు.

First Published:  3 Jan 2021 6:16 AM GMT
Next Story