Telugu Global
NEWS

తాడిపత్రిలో మళ్లీ టెన్షన్​.. జేసీ సోదరుల నిర్బంధం..!

తాడిపత్రిలో మరోసారి టెన్షన్​ వాతావరణం నెలకొన్నది. డిసెంబర్​ 24న తాడిపత్రిలో వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య పరస్పర గొడవ జరిగిన సంగతి తెలిసిందే. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై జేసీ ప్రభాకర్​రెడ్డి మనిషిగా అనుమానిస్తున్న ఓ వ్యక్తి సోషల్​మీడియాలో అసభ్యంగా పోస్టులు పెట్టాడు. అయితే అతడు జేసీ ఇంట్లో ఉన్నాడన్న సమాచారంతో ఎమ్మెల్యే తన మనుషులతో కలిసి జేసీ ప్రభాకర్​రెడ్డికి ఇంటిపై దాడికి దిగారు. ఈ క్రమంలో జేసీ మనుషులకు.. ఎమ్మెల్యే అనుచరులకు మధ్య […]

తాడిపత్రిలో మళ్లీ టెన్షన్​.. జేసీ సోదరుల నిర్బంధం..!
X

తాడిపత్రిలో మరోసారి టెన్షన్​ వాతావరణం నెలకొన్నది. డిసెంబర్​ 24న తాడిపత్రిలో వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య పరస్పర గొడవ జరిగిన సంగతి తెలిసిందే. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై జేసీ ప్రభాకర్​రెడ్డి మనిషిగా అనుమానిస్తున్న ఓ వ్యక్తి సోషల్​మీడియాలో అసభ్యంగా పోస్టులు పెట్టాడు. అయితే అతడు జేసీ ఇంట్లో ఉన్నాడన్న సమాచారంతో ఎమ్మెల్యే తన మనుషులతో కలిసి జేసీ ప్రభాకర్​రెడ్డికి ఇంటిపై దాడికి దిగారు. ఈ క్రమంలో జేసీ మనుషులకు.. ఎమ్మెల్యే అనుచరులకు మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులు లాఠీ చార్జీ కూడా చేశారు. ఇరువర్గాల నాయకులు, కార్యకర్తల వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి.

అయితే ఆ సమయంలో జేసీ ప్రభాకర్​రెడ్డి, ఆయన తనయుడు ఇంట్లో లేరు. విషయం తెలుసుకున్న వాళ్లు తాడిపత్రిలోని తమ ఇంటికి వచ్చారు.ఈ సందర్భంగా మరోసారి జేసీ అనుచరులు రెచ్చిపోయారు. తాడిపత్రిలో మరోసారి విధ్వంసం సృష్టించారు. అయితే జేసీ ఆయన కుమారుడిపై తాడిపత్రికి చెందిన కొందరు దళితులు కేసులు పెట్టడంతో.. పోలీసులు జేసీ ప్రభాకర్​రెడ్డి.. ఆయన కుమారుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.

అయితే పోలీసుల తీరును జేసీ సోదరులు తీవ్రంగా ఖండించారు. పోలీసులు ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసును దుర్వినియోగం చేస్తున్నారని వాళ్లు ఆరోపించారు. పోలీసుల తీరుకు నిరసనగా నేడు తాడిపత్రిలో మౌనదీక్ష చేయనున్నట్టు జేసీ ప్రభాకర్​రెడ్డి ప్రకటించారు. అనంతరం అంబేద్కర్​ విగ్రహానికి నివాళి అర్పించి.. తహసీల్దార్​కు వినతి పత్రం ఇస్తామని ఆయన ప్రకటించారు. జేసీ ప్రభాకర్​రెడ్డి ప్రకటన నేపథ్యంలో తాడిపత్రిలో తీవ్ర టెన్షన్​ నెలకొన్నది. జేసీ అనుచరులు మౌనదీక్షకు భారీగా తరలివచ్చి.. విధ్వంసానికి పాల్పడతారేమోనని పోలీసులు అనుమానించారు. జేసీ మౌనదీక్షకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు.

మరోవైపు జేసీ సోదరులను గృహనిర్భంధం విధించారు. అయితే జేసీ ప్రభాకర్​రెడ్డి మాత్రం తాడిపత్రిలోని తన నివాసంలోనే ఉంటూ దీక్షను కొనసాగిస్తున్నారు. జేసీ ప్రభాకర్​రెడ్డి తరపున ఆయన భార్య ఉమ.. అంబేద్కర్​ విగ్రహానికి నివాళి అర్పించారు. మరోవైపు జేసీ దివాకర్​రెడ్డిని జూటురులోని ఆయన ఫామ్​హౌస్​లో గృహనిర్బంధం చేశారు. ప్రస్తుతం తాడిపత్రిలో శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయని పోలీసులు ప్రకటించారు.

First Published:  4 Jan 2021 4:36 AM GMT
Next Story