Telugu Global
National

క్లబ్ లు బాబువి.. వాటాలు చినబాబువి..

గుడివాడలో పేకాట స్థావరాలపై జరిగిన దాడిని తనకి అంటగట్టేందుకు చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి కొడాలి నాని. తాను సీఎం జగన్ దగ్గరకు పరిగెత్తుకెళ్లానంటూ పూర్తిగా అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. సీఎం తనను పిలిపించారనే ప్రచారం కూడా అభూత కల్పన అని అన్నారు. ఇప్పటి వరకూ సీఎం జగన్ ని తన వ్యక్తిగత అవసరాలకోసం కలవలేదని, భవిష్యత్ లో కూడా అలాంటి వ్యవహారాలపై కలవబోనని, కేవలం ప్రజా సమస్యల […]

క్లబ్ లు బాబువి.. వాటాలు చినబాబువి..
X

గుడివాడలో పేకాట స్థావరాలపై జరిగిన దాడిని తనకి అంటగట్టేందుకు చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి కొడాలి నాని. తాను సీఎం జగన్ దగ్గరకు పరిగెత్తుకెళ్లానంటూ పూర్తిగా అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. సీఎం తనను పిలిపించారనే ప్రచారం కూడా అభూత కల్పన అని అన్నారు. ఇప్పటి వరకూ సీఎం జగన్ ని తన వ్యక్తిగత అవసరాలకోసం కలవలేదని, భవిష్యత్ లో కూడా అలాంటి వ్యవహారాలపై కలవబోనని, కేవలం ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ముఖ్యమంత్రిని కలుస్తానని స్పష్టం చేశారాయన.

చంద్రబాబు, ఉమ.. మీరా నాకు చెప్పేది..?
డబ్బులు సంపాదించాలంటే చాలా మార్గాలు ఉన్నాయని, చంద్రబాబు, ఉమాలాగా వ్యభిచార గృహాలు, పేకాట క్లబ్‌ లు నిర్వహించాల్సిన గతి తనకు పట్టలేదని అన్నారు నాని. పేకాట క్లబ్ లపై బతికిన చరిత్ర చంద్రబాబు, ఉమాలదేనని ఎద్దేవా చేశారు. విజయవాడ, గుంటూరు క్లబ్ లలో పేకాట ఆడించి, ఆ వసూళ్ళలో కొంత వాటాను పప్పునాయుడుకి ఉమా పంపేవారని అన్నారు నాని. కొనకళ్ల నారాయణ టీడీపీ ఎంపీగా ఉన్నప్పుడు ఆయన ఇంట్లోనే జూదం ఆడేవారని చెప్పారు. 2 ఎకరాల ఆస్తి నుంచి ఈరోజు వేల కోట్ల ఆస్తులకు చంద్రబాబు ఎదిగారంటే దానికి కారణం ఇలాంటి గ్యాంబ్లింగ్ లేనని మండిపడ్డారు.
దమ్ము, ధైర్యంతో పోలీసుల్ని పంపి పేకాట స్థావరాలపై దాడులు తమ ప్రభుత్వం చేస్తే.. తాను పేకాట ఆడిస్తున్నానని దేవినేని ఉమా.. చంద్రబాబు లాంటి చవట దద్దమ్మలు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. పేకాట స్థావరాలపై వైసీపీ జెండా, వాటర్ బాటిల్ ఉందని పిచ్చి మాటలు మాట్లాడితే తాట తీస్తానని హెచ్చరించారు.

దాడి చేయించింది మా ప్రభుత్వమే..?
పేకాట క్లబ్ లపై కఠిన చట్టాలు చేస్తూ సీఎం జగన్ నిర్ణయాలు తీసుకున్నారని, అందులో భాగంగానే స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో దాడులు చేస్తోందని అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో దాడులు జరిగితే.. దాన్ని చంద్రబాబు పట్టించినట్టో, ఏబీఎన్ రాధాకృష్ణ చేసినట్టో, టీవీ 5 అధినేతలు చేయించినట్టో చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. గుడివాడలో క్లబ్ లు మూయించింది తానే అనే విషయం నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసని అన్నారు నాని.

మీడియా హడావిడి ఏంటి..?
గుడివాడలో పేకాట ఆడుతున్నారని ఓ వర్గం మీడియాలో హడావుడి చేస్తున్నారని, పేకాట ఆడేవాళ్లు ఒక్క గుడివాడలోనే ఉండరని, ఎక్కడైనా ఉంటారని చెప్పారు. చెరువు వద్ద పేకాట శిబిరంపై పోలీసులు రైడ్ చేశారని, అది తన నియోజకవర్గానికి బోర్డర్ అని గుర్తు చేశారు. ఒకేచోట పార్కింగ్ ‌లో కార్లు పెట్టి.. అందరూ కార్లలో పేకాట ఆడుతున్నారని, 28 కార్లు, 13 బైక్‌లు దొరికాయని, మొత్తం మీద 40 లక్షల రూపాయల నగదు సీజ్ చేశారని చెప్పారు. వారందరిపై కేసులు పెట్టి కోర్టులో ప్రవేశపెడతామన్నారు. కొంతమంది అక్కడినుంచి తప్పించుకున్నారని, దానిపై కూడా విచారణ జరుపుతామన్నారు. ఇందులో చంద్రబాబు దేవినేని ఉమాల పాత్రే కాదు, ఎవరున్నా చట్టం తన పని తాను చేసుకుపోతుందని అన్నారు నాని.

First Published:  4 Jan 2021 9:52 AM GMT
Next Story