Telugu Global
National

వ్యాక్సిన్ పై కాంగ్రెస్ గుస్సా..

అది బీజేపీ వ్యాక్సిన్, నేను తీసుకోనంటూ సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ సెటైర్లు వేసిన రోజుల వ్యవధిలోనే.. కాంగ్రెస్ కూడా వ్యాక్సిన్ అనుమతులపై మండిపడింది. హడావిడిగా ఎందుకు అనుమతులిచ్చారని, దీని వెనక ఉన్న కారణం ఏంటని విమర్శలు ఎక్కు పెట్టారు కాంగ్రెస్ నేతలు. అప్పుడు ఆలస్యం.. ఇప్పుడెందుకు తొందర..? కరోనా కేసులు బైటపడుతున్న తొలినాళ్లలో.. రాహుల్ గాంధీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కరోనాపై ముందుగా రాహుల్ హెచ్చరించినా ప్రధాని మోదీ పట్టించుకోలేదని, చేతులు కాలాక […]

వ్యాక్సిన్ పై కాంగ్రెస్ గుస్సా..
X

అది బీజేపీ వ్యాక్సిన్, నేను తీసుకోనంటూ సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ సెటైర్లు వేసిన రోజుల వ్యవధిలోనే.. కాంగ్రెస్ కూడా వ్యాక్సిన్ అనుమతులపై మండిపడింది. హడావిడిగా ఎందుకు అనుమతులిచ్చారని, దీని వెనక ఉన్న కారణం ఏంటని విమర్శలు ఎక్కు పెట్టారు కాంగ్రెస్ నేతలు.

అప్పుడు ఆలస్యం.. ఇప్పుడెందుకు తొందర..?
కరోనా కేసులు బైటపడుతున్న తొలినాళ్లలో.. రాహుల్ గాంధీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కరోనాపై ముందుగా రాహుల్ హెచ్చరించినా ప్రధాని మోదీ పట్టించుకోలేదని, చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టుగా లాక్ డౌన్ తో అందర్నీ ఇబ్బంది పెట్టారని కాంగ్రెస్ విమర్శించింది. రాహుల్ కరోనాపై చేసిన హెచ్చరికలు అప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. కట్ చేస్తే.. ఇప్పుడు వ్యాక్సినేషన్ పై కేంద్రం హడావిడి పడుతోందనే విషయం అందరికీ అర్థమవుతూనే ఉంది. తుది దశ ప్రయోగాల్లో ఉన్న భారత్ బయోటెక్ తయారీ కొవాక్సిన్ టీకాకి కూడా డీసీజీఐ అనుమతి ఇవ్వడం సంచలనంగా మారింది. దీంతో కాంగ్రెస్ మరోసారి తన విమర్శలకు పదును పెట్టింది.

వైరస్ వ్యాప్తి దశలో నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించిన బీజేపీ, వ్యాక్సిన్ ప్రయోగాల దశలోనే ఉన్నా అత్యవసర అనుమతి విషయంలో ఆవేశ పడుతోందని మండిపడ్డారు కాంగ్రెస్ నేతలు. “భారత్ బయోటెక్ ప్రథమ శ్రేణి సంస్థే, కాదనలేం అయితే మూడో దశ ప్రయోగాలు పూర్తి కాకముందే ప్రోటోకాల్స్ విషయంలో ఎందుకు మినహాయింపు ఇచ్చారం”టూ కాంగ్రెస్ నేతలు అనంద్ శర్మ, శశిథరూర్, జైరాం రమేష్ విమర్శించారు. ఇది అత్యంత ప్రమాదకర నిర్ణయం అని అన్నారు. ఫ్రంట్ లైన్ వారియర్స్ గా భావిస్తున్న వారికి ఇలాంటి అపరిపక్వ వ్యాక్సిన్ ఇవ్వడం ఏంటని, ఆరోగ్య శాఖ దీనిపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా తయారు చేసిన కొవిషీల్డ్ టీకా అనుమతిపై కాంగ్రెస్ నేతలెవరూ విమర్శించకపోవడం విశేషం. కొవిషీల్డ్ టీకాకు ఇప్పటికే పలు ఇతర దేశాలు కూడా అనుమతులిచ్చేశాయి. ఆయా దేశాల్లో ఆ టీకా వాడకం కూడా మొదలైంది. అయితే భారత్ బయోటెక్ సంస్థ తయారు చేసిన కొవాక్సిన్ విషయంలోనే ప్రయోగాలు పూర్తికాకముందే అనుమతులివ్వడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీన్ని తప్పుడు నిర్ణయంగా కాంగ్రెస్ విమర్శిస్తోంది. భారత దేశ ప్రజల ప్రాణాలు పణంగా పెడతారా అంటూ ప్రశ్నిస్తోంది. నెటిజన్లు కూడా ప్రభుత్వ నిర్ణయంపై మండిపడుతున్నారు. ప్రపంచ దేశాల్లో లాగా ఇక్కడ కూడా భారత్ బయోటెక్ రూపొందించిన కొవాక్సిన్ ను మొదట మోదీ అతని మంత్రివర్గ సహచరులు, వేయించుకుంటారా? అనిప్రశ్నిస్తున్నారు.

First Published:  3 Jan 2021 10:01 PM GMT
Next Story