Telugu Global
National

టీపీసీసీ చీఫ్‌గా జీవన్‌రెడ్డి ? రేవంత్‌కి ఆ కీలక పదవి ?

తెలంగాణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఎవరు? నెల రోజులుగా నలుగుతున్న ప్రశ్న. ఉత్తమ్‌ రాజీనామా చేశారు. కానీ కొత్త ప్రెసిడెంట్‌ను మాత్రం ఇంకా ప్రకటించలేదు. ఇవాళ,రేపు అంటూ ప్రచారం జరుగుతోంది. కానీ హస్తిన నుంచి ప్రకటన మాత్రం రావడం లేదు. తాజా సమాచారం ప్రకారం పీసీసీ అధ్యక్షుడిగా జీవన్‌రెడ్డిని ప్రకటిస్తారని తెలుస్తోంది. రేవంత్‌రెడ్డికి ప్రచార కమిటీ ఛైర్మన్‌ పదవి క‌ట్ట‌బెట్టార‌ని అంటున్నారు. ఈ లీకు ఎక్కడి నుంచో రాలేదు. రెండు రోజులుగా న్యూస్‌ చానల్‌ లైవ్ షోలకు హాజరవుతున్న […]

టీపీసీసీ చీఫ్‌గా జీవన్‌రెడ్డి ? రేవంత్‌కి ఆ కీలక పదవి ?
X

తెలంగాణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఎవరు? నెల రోజులుగా నలుగుతున్న ప్రశ్న. ఉత్తమ్‌ రాజీనామా చేశారు. కానీ కొత్త ప్రెసిడెంట్‌ను మాత్రం ఇంకా ప్రకటించలేదు. ఇవాళ,రేపు అంటూ ప్రచారం జరుగుతోంది. కానీ హస్తిన నుంచి ప్రకటన మాత్రం రావడం లేదు.

తాజా సమాచారం ప్రకారం పీసీసీ అధ్యక్షుడిగా జీవన్‌రెడ్డిని ప్రకటిస్తారని తెలుస్తోంది. రేవంత్‌రెడ్డికి ప్రచార కమిటీ ఛైర్మన్‌ పదవి క‌ట్ట‌బెట్టార‌ని అంటున్నారు. ఈ లీకు ఎక్కడి నుంచో రాలేదు. రెండు రోజులుగా న్యూస్‌ చానల్‌ లైవ్ షోలకు హాజరవుతున్న రేవంత్ ఈ విషయాన్నే బయటపెట్టారు. తనకు పీసీసీ ఇచ్చినా ఒకే….ప్రచార కమిటీ ఛైర్మన్ పదవి ఇచ్చినా ఒకే.. అని చెప్పారు. జనంలోకివెళ్లాలంటేనే ప్రచార కమిటీ బెటర్‌ అంటూ చెప్పుకొచ్చారు.

ఇటీవల జీవన్‌రెడ్డి కూడా ఢిల్లీ వెళ్లి వచ్చారు. హైకమాండ్‌ను కలిశారు. తన మనసులో మాట చెప్పొచ్చారు. కానీ ఎక్కడా బయటపడలేదు. కొందరు సీనియర్లు పీసీసీ అధ్యక్షుడి పదవి ఇస్తే కోమటిరెడ్డికి ఇవ్వండి లేదా జీనన్‌రెడ్డికి ఇవ్వాలని ప్రతిపాదించారట. రేవంత్‌కు ప్రచార కమిటీ ఛైర్మన్‌ పదవి ఇస్తే తమకు అభ్యంతరం లేదని అన్నారట. ఇందులో భాగంగా జీవన్‌కు పీసీసీ పదవి ఇచ్చి..రేవంత్‌ను ప్రచార కమిటీ ఛైర్మన్‌ చేస్తారని గుసగుసలు విన్పిస్తున్నాయి.

రేవంత్‌ అనుచరులు మాత్రం పీసీసీ పదవి కన్‌ఫామ్‌ అయిందనే ధీమాలో ఉన్నారు. అందుకే రేవంత్ మీడియాలో యాక్టివ్ అయ్యారని అంటున్నారు. రాహుల్‌గాంధీ విదేశాల నుంచి తిరిగివచ్చారు. దీంతో ఇవాళ లేదా రేపు పీసీసీ చీఫ్‌లను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది

First Published:  4 Jan 2021 8:29 PM GMT
Next Story