Telugu Global
Cinema & Entertainment

నిజంగానే లాయర్ అయిపోయింది

ఓవైపు సినిమాలు చేస్తూనే, మరోవైపు తమకిష్టమైన కోర్సులు పూర్తిచేస్తుంటారు హీరోయిన్లు. ఉదాహరణకు కాజల్ నే తీసుకుంటే, ఆమెకు సైకాలజీ అంటే ఇష్టం. ఇప్పటికే 3 డిగ్రీలు పూర్తిచేసింది. తాజాగా లాక్ డౌన్ లో కూడా ఓ కోర్స్ పూర్తిచేసింది. కాజల్ లా చాలామంది హీరోయిన్లు సినిమాలతో పాటు చదువును కూడా కొనసాగిస్తూ వస్తున్నారు. ఇప్పుడీ లిస్ట్ లోకి హీరోయిన్ మాళవిక శర్మ కూడా చేరిపోయింది. ఈ హీరోయిన్ ఏకంగా లా డిగ్రీ పూర్తిచేసింది. తాజాగా మహారాష్ట్ర బార్ […]

నిజంగానే లాయర్ అయిపోయింది
X

ఓవైపు సినిమాలు చేస్తూనే, మరోవైపు తమకిష్టమైన కోర్సులు పూర్తిచేస్తుంటారు హీరోయిన్లు. ఉదాహరణకు కాజల్ నే తీసుకుంటే, ఆమెకు సైకాలజీ అంటే ఇష్టం. ఇప్పటికే 3 డిగ్రీలు పూర్తిచేసింది. తాజాగా లాక్ డౌన్ లో కూడా ఓ కోర్స్ పూర్తిచేసింది. కాజల్ లా చాలామంది హీరోయిన్లు సినిమాలతో పాటు చదువును కూడా కొనసాగిస్తూ వస్తున్నారు. ఇప్పుడీ లిస్ట్ లోకి హీరోయిన్ మాళవిక శర్మ కూడా చేరిపోయింది.

ఈ హీరోయిన్ ఏకంగా లా డిగ్రీ పూర్తిచేసింది. తాజాగా మహారాష్ట్ర బార్ కౌన్సిల్ నుంచి గుర్తింపు, సర్టిఫికేట్ కూడా అందుకుంది. తన ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది మాళవిక శర్మ. తనకొచ్చిన సర్టిఫికేట్, ఐడెంటిటీ కార్డుల్ని కూడా షేర్ చేసింది.

ప్రస్తుతం రామ్ హీరోగా రెడ్ సినిమా చేసింది మాళవిక శర్మ. ఈ సినిమాపై ఆమె చాలా ఆశలు పెట్టుకుంది. ఈ సినిమా సక్సెస్ అయితేనే ఆమెకు తెలుగులో మరిన్ని అవకాశాలొస్తాయి. లేదంటే కెరీర్ కష్టమే.

First Published:  6 Jan 2021 6:10 AM GMT
Next Story