Telugu Global
National

‘పీసీసీ’ ఆగిపోయినట్టే..! అధిష్ఠానానికి తప్పుడు నివేదికలు వెళ్తున్నాయి.. మధుయాష్కి కామెంట్లు..

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి నియామకం పట్ల గత కొంతకాలంగా ఊగిసలాట కొనసాగుతున్నది. మంగళవారం పీసీసీ అధ్యక్షుడిని ప్రకటిస్తున్నారని తెగ హడావుడి సాగింది. అనూహ్యంగా జీవన్​రెడ్డి పేరు తెరమీదకు వచ్చింది. రేవంత్​రెడ్డికి ప్రచారకమిటీ చైర్మన్​గా బాధ్యతలు అప్పగించబోతున్నారని.. జీవన్​రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా.. కోమటిరెడ్డి వెంకట్​రెడ్డిని పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్ గా నియమిస్తున్నారని వార్తలు వచ్చాయి. మంగళవారం సాయంత్రం.. లేదా బుధవారం ఉదయం కాంగ్రెస్​ హైకమాండ్​ ప్రకటన చేస్తుందని మీడియా సంస్థలు ప్రకటించాయి. కానీ ఉన్నట్టుండి ఈ ప్రక్రియ ఆగిపోయింది. […]

‘పీసీసీ’ ఆగిపోయినట్టే..! అధిష్ఠానానికి తప్పుడు నివేదికలు వెళ్తున్నాయి.. మధుయాష్కి కామెంట్లు..
X

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి నియామకం పట్ల గత కొంతకాలంగా ఊగిసలాట కొనసాగుతున్నది. మంగళవారం పీసీసీ అధ్యక్షుడిని ప్రకటిస్తున్నారని తెగ హడావుడి సాగింది. అనూహ్యంగా జీవన్​రెడ్డి పేరు తెరమీదకు వచ్చింది. రేవంత్​రెడ్డికి ప్రచారకమిటీ చైర్మన్​గా బాధ్యతలు అప్పగించబోతున్నారని.. జీవన్​రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా.. కోమటిరెడ్డి వెంకట్​రెడ్డిని పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్ గా నియమిస్తున్నారని వార్తలు వచ్చాయి. మంగళవారం సాయంత్రం.. లేదా బుధవారం ఉదయం కాంగ్రెస్​ హైకమాండ్​ ప్రకటన చేస్తుందని మీడియా సంస్థలు ప్రకటించాయి. కానీ ఉన్నట్టుండి ఈ ప్రక్రియ ఆగిపోయింది.

కాంగ్రెస్​ ప్రకటన చేయకుండా ఎవరో బ్రేకులు వేశారు. అయితే కాంగ్రెస్​ సీనియర్ నాయకుడు జానారెడ్డి జోక్యం చేసుకోవడంతో ప్రకటన పెండింగ్​లో పడిందని సమాచారం. త్వరలో నాగర్జున సాగర్​ ఉప ఎన్నిక జరగబోతున్నది. అక్కడ కాంగ్రెస్​ తరపున జానారెడ్డి లేదా ఆయన కుమారుడు రఘువీర్​ రెడ్డి పోటీచేయబోతున్నారు. అయితే ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్​ అధిష్ఠానం అధ్యక్షుడిని ప్రకటిస్తే వర్గపోరు మొదలవుతుందని.. దానివల్ల సాగర్​ ఎన్నికల్లో కాంగ్రెస్​ నష్టపోతుందని జానారెడ్డి అధిష్ఠానానికి చెప్పారట.
దీంతో ప్రకటన వాయిదా పడింది.

ఇదిలా ఉంటే ఈ విషయంపై బుధవారం కాంగ్రెస్​ సీనియర్​ నాయకుడు మధుయాష్కి గౌడ్​ స్పందించారు. సాగర్​ ఎన్నిక జరిగే వరకు పీసీసీ ప్రకటన ఉండకపోవచ్చని ఆయన పేర్కొన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. ‘కాంగ్రెస్​ పార్టీలో ఏదైనా జరగొచ్చు. జీవన్​రెడ్డి పేరు అనూహ్యంగా తెరమీదకు రావడం అందులో భాగమే. జీవన్​రెడ్డి నాకూ సన్నిహితుడే. ఆయన ఎంపికపట్ల నాకు అభ్యంతరం లేదు. కానీ కాంగ్రెస్​ కీలక పదవులన్నీ రెడ్లకు ఇస్తే ప్రయోజనం ఏమిటి? ఇంతకాలం పీసీసీ పీఠం మీద రెడ్డే ఉన్నారు. పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారా? సాగర్​లో జానారెడ్డి ఓడింది కూడా బీసీ నేత చేతిలోనే. సోనియాగాంధీకి కొందరు తప్పుడు సమాచారం ఇస్తున్నారు. అన్ని పదవులు ఒకే సామాజికవర్గానికి ఇవ్వడం సరికాదు. అయినా పార్టీలో మాణిక్యం ఠాగూర్​ చెప్పిందే ఫైనల్​ కాదు.

నాకు కోమటిరెడ్డి బ్రదర్స్​ వెన్నుపోటు పొడిచారు. భువనగిరిలో పోటీచేయాలంటూ నాకు ఆశలు కల్పించి చివరకు మోసం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీసీనేతకు కీలక బాధ్యతలు అప్పజెప్పాలన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. బీసీలు, రెడ్లు కలిస్తేనే అధికారం వస్తుంది’ అంటూ ఆయన పేర్కొన్నారు. మరోవైపు పీసీసీ అధ్యక్షుడిని ఎప్పుడు ప్రకటిస్తారా? అంటూ కాంగ్రెస్​ కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు.

First Published:  6 Jan 2021 10:17 AM GMT
Next Story