Telugu Global
National

అఖిల వ్యవహారంపై బాబు మౌనం.. పార్టీలో అంతర్మథనం..

టీడీపీకి చెందిన మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ అరెస్టై 24గంటలు కావస్తున్నా.. కనీసం పార్టీ జాతీయ అధ్యక్షుడు కానీ, రాష్ట్ర అధ్యక్షుడు కానీ.. పక్క రాష్ట్రంలో అరెస్ట్ అయింది కాబట్టి ఆ రాష్ట్ర అధ్యక్షుడు కానీ స్పందించలేదు. పార్టీ సోషల్ మీడియా విభాగంలో కూడా ఓ సానుభూతి ప్రెస్ నోట్ విడుదల కాలేదు. ఆఖరికి సదరు మహిళా మాజీ మంత్రి సొంత జిల్లానుంచి కూడా సింపతీగా ఎవరూ మాట్లాడలేదు. అఖిల వ్యవహారంపై టీడీపీలో ఏం జరుగుతోంది..? […]

అఖిల వ్యవహారంపై బాబు మౌనం.. పార్టీలో అంతర్మథనం..
X

టీడీపీకి చెందిన మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ అరెస్టై 24గంటలు కావస్తున్నా.. కనీసం పార్టీ జాతీయ అధ్యక్షుడు కానీ, రాష్ట్ర అధ్యక్షుడు కానీ.. పక్క రాష్ట్రంలో అరెస్ట్ అయింది కాబట్టి ఆ రాష్ట్ర అధ్యక్షుడు కానీ స్పందించలేదు. పార్టీ సోషల్ మీడియా విభాగంలో కూడా ఓ సానుభూతి ప్రెస్ నోట్ విడుదల కాలేదు. ఆఖరికి సదరు మహిళా మాజీ మంత్రి సొంత జిల్లానుంచి కూడా సింపతీగా ఎవరూ మాట్లాడలేదు.

అఖిల వ్యవహారంపై టీడీపీలో ఏం జరుగుతోంది..?
మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర అరెస్ట్ ల సందర్భంగా.. టీడీపీ నేతలు ఎంత రాద్ధాంతం చేశారో అందరికీ తెలుసు. సాక్షాత్తూ చంద్రబాబు నాయుడే అది ప్రభుత్వ కుట్ర అంటూ తీవ్ర విమర్శలు చేశారు. ప్రైవేట్ బస్సుల వ్యవహారంలో జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్ అయినా కూడా చంద్రబాబు ఆయనకి మద్దతుగానే మాట్లాడారు. అదంతా ప్రభుత్వ కుట్రేనంటూ ధ్వజమెత్తారు. మరి అఖిల ప్రియ వ్యవహారంలో మాత్రం బాబు ఇంకా మౌనాన్నే ఆశ్రయించారు.

ఏపీలోనే జ‌రిగి ఉంటే.. ప్ర‌భుత్వానికి నింద త‌ప్పేది కాదేమో..
అఖిల ప్రియ అరెస్ట్ ఏపీలో జరిగి ఉంటే.. కచ్చితంగా దీన్ని కూడా ప్రభుత్వం ఖాతాలోనే జమ చేసేవారు బాబు. మహిళా నేతను ఎలా అరెస్ట్ చేస్తారు, మానవత్వం లేదా, కనీసం మహిళ అనే గౌరవం లేదా, పోలీసులు ప్రభుత్వానికి తొత్తుల్లా మారిపోయారు.. అంటూ సాగే డైలాగులు జనం వినాల్సి వచ్చేది. కానీ చంద్రబాబుకి ఇప్పుడా అవకాశం లేకుండా పోయింది. అఖిల అరెస్ట పక్క రాష్ట్రంలో జరిగింది. వివాదం కూడా ఆ రాష్ట్రానికి సంబంధించిందే. పైగా.. పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రికి బాధితులు బంధువులు కూడా. అయితే గియితే పక్క కేసీఆర్ ని, తెలంగాణ పోలీసుల్ని విమర్శించాల్సి ఉంటుంది. పొరపాటున కేసీఆర్ పై మాట తూలితే.. ఏమవుతుందో బాబుకి బాగా తెలుసు. ఓటుకు నోటు కేసు ఆయన మెడపై కత్తిలాగా ఇంకా వేలాడుతూనే ఉంది. ఈ నేపథ్యంలో అరెస్ట్ వ్యవహారంలో ఎవర్నీ నిందించకుండా సైలెంట్ అయిపోయారు బాబు.

కనీసం అఖిల ప్రియపై సానుభూతి కూడా లేదా..?
అరెస్ట్ విషయంలో ఎవరినీ విమర్శించలేదు సరే, కనీసం అఖిల ప్రియపై కూడా బాబు సానుభూతిగా ఎందుకు మాట్లాడలేదనేదే ఇప్పుడు చర్చనీయాంశం. తమ పార్టీ కార్యకర్తల్ని అరెస్ట్ చేసినా అంతెత్తున ఎగిరిపడి, మీకు మేమున్నామంటూ భరోసా ఇచ్చే బాబు.. అఖిలప్రియ విషయంలో ఎందుకో మౌనాన్నే ఆశ్రయించారు. బాబు వెనకేసుకొచ్చినంత మాత్రాన అఖిల చేసిన తప్పులు ఒప్పు అయిపోతాయని చెప్పలేం కానీ.. పార్టీ మౌనంతో భూమా కుటుంబ సభ్యులు మాత్రం బాగా హర్ట్ అయ్యారని తెలుస్తోంది. తన మౌనంతో పరోక్షంగా అఖిల ప్రియ తప్పు చేసిందని చంద్రబాబు ఒప్పుకున్నట్టు తెలుస్తోంది.

First Published:  6 Jan 2021 11:24 PM GMT
Next Story