Telugu Global
International

టెంపరితనానికి పరాకాష్టే ట్రంప్

డొనాల్డ్ ట్రంప్ టెంపరితనానికి బ్రాండ్ అంబాసిడర్ గా మారుతున్నాడు. కిందపడ్డా పైచేయి నాదే అనే అతడి వైఖరి ఆశ్చర్యంగొలుపుతోంది. అధ్యక్ష కుర్చీ నుంచి తప్పుకోవల్సిన సమయం దగ్గరపడుతుండడంతో అతడిలో అసహనం పెరుగుతోంది. మొదటి నుంచీ ఎన్నికల ఫలితాలపై అనుమానం వ్యక్తం చేస్తున్న ట్రంప్ అధికార మార్పిడి మోకాలడ్డుతున్నాడు. డెమోక్రట్లకు వ్యతిరేకంగా న్యాయస్థానాల్లో అరవైకిపైగా కేసులు వేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఇప్పడు రోడ్లమీదకొచ్చి మరీ రచ్చ చేస్తున్నాడు. అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్‌ గెలుపును ధ్రువీకరించే సమావేశాన్ని అడ్డుకునేందుకు […]

టెంపరితనానికి పరాకాష్టే ట్రంప్
X

డొనాల్డ్ ట్రంప్ టెంపరితనానికి బ్రాండ్ అంబాసిడర్ గా మారుతున్నాడు. కిందపడ్డా పైచేయి నాదే అనే అతడి వైఖరి ఆశ్చర్యంగొలుపుతోంది. అధ్యక్ష కుర్చీ నుంచి తప్పుకోవల్సిన సమయం దగ్గరపడుతుండడంతో అతడిలో అసహనం పెరుగుతోంది. మొదటి నుంచీ ఎన్నికల ఫలితాలపై అనుమానం వ్యక్తం చేస్తున్న ట్రంప్ అధికార మార్పిడి మోకాలడ్డుతున్నాడు. డెమోక్రట్లకు వ్యతిరేకంగా న్యాయస్థానాల్లో అరవైకిపైగా కేసులు వేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఇప్పడు రోడ్లమీదకొచ్చి మరీ రచ్చ చేస్తున్నాడు.

అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్‌ గెలుపును ధ్రువీకరించే సమావేశాన్ని అడ్డుకునేందుకు ట్రంప్‌ మద్దతుదారులు కేపిటల్‌ భవనాన్ని ముట్టడించారు. దీంతో వాషింగ్టన్‌ డీసీలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ సందర్భంగా జరిగిన పోలీసు కాల్పలుల్లో నలుగురు వ్యక్తులు మృతి చెందారు. కేపిటల్ బిల్డింగ్ పై దాడిని జో బైడెన్ ఖండించారు. ట్రంప్ మద్దతుదారులది నిరసన కాదని, రాజకీయ తిరుగుబాటు అని వ్యాఖ్యానించారు. ట్రంప్ తన మద్దతు దారులను వెనక్కి పిలవాలని, దేశ విద్రోహ చర్యలను నిలిపివేయాలని కోరారు.

డొనాల్డ్ ట్రంప్ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శాంతియుతంగా అధికార మార్పిడికి సహకరించాలని ప్రపంచ దేశాలు కోరుతున్నాయి. పార్లమెంట్ కేపిటల్ భవనం ముట్టడి నేపథ్యంలో సొంత పార్టీ నుంచీ ట్రంప్ కి వ్యతిరేకత ఎదురవుతోంది. ట్రంప్ వైఖరిని తప్పుబడుతూ ఆయనను పదవి నుంచి తొలగించేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

మరో పదమూడు రోజులు ట్రంప్ అధ్యక్షుడిగా కొనసాగడానికి అవకాశం ఉంది. జనవరి 20న జో బైడెన్ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేస్తారు. కాగా, అప్పటి వరకూ ట్రంప్ పదవిలో ఉంటే అధికార దుర్వినియోగానికి ప్రయత్నిస్తాడనే వాదన వినిపిస్తోంది. జాతీయ భద్రత కారణాల దృష్ట్యా ట్రంప్ ను తక్షణమే తొలగించాలని డెమోక్రాట్లు డిమాండ్ చేస్తున్నారు. కాగా అదే జరిగితే అతడి స్థానంలో ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ఆ బాధ్యతలు నిర్వర్తించే అవకాశం ఉంటుంది.

మరోవైపు సామాజిక మాద్యమాల్లోనూ ట్రంప్ దుందుడుకు వైఖరిని ప్రదర్శిస్తున్నాడు. తాజాగా ఆయన సామాజిక మాద్యమాల్లో పోస్ట్ చేసిన వీడియోలు వివాదాస్పదంగా మారాయి. అమెరికా పార్లమెంట్ కేపిటల్ భవనాన్ని ఆయన మద్దతుదారులు ముట్టడించిన వీడియోలను ట్రంప్ సామాజిక మాద్యమాల్లో పోస్ట్ చేశాడు. అధ్యక్ష ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, దొడ్డిదారిన డెమోక్రాట్లు అధికారంలోకి రావాలనుకుంటున్నారని తన మద్దతుదారులనుద్దేశించి పోస్ట్ చేశారు. ఆయన వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయని భావించిన ట్విట్టర్, ఫేస్ బుక్ సంస్థలు ట్రంప్ పోస్టులను తొలగించాయి. ట్విటర్ట్ ట్రంప్ అకౌంట్ ను తాత్కాలికంగా బ్లాక్ చేసింది. మొత్తానికి

First Published:  7 Jan 2021 2:37 AM GMT
Next Story