“అల” మళ్లీ కలుస్తున్నారు!

అల వైకుంఠపురములో.. ఈ సినిమా బన్నీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్. అంతేకాదు, టాలీవుడ్ లోనే ఇండస్ట్రీ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. అలా బన్నీ కెరీర్ లో మరపురాని సినిమాగా నిలిచిపోయిన అల వైకుంఠపురములో సినిమా రిలీజై త్వరలోనే ఏడాది కావొస్తోంది. ఈ సందర్భంగా ఆ సినిమా సక్సెస్ ను మరోసారి సెలబ్రేట్ చేసుకోవాలని భావిస్తున్నాడు బన్నీ.

11వ తేదీన అల వైకుంఠపురములో నటీనటులు, టెక్నీషియన్లను గీతా ఆర్ట్స్ ఆఫీస్ కు ఆహ్వానిస్తున్నాడు బన్నీ. వాళ్లందరితో చిన్న గెట్ టు గెదర్ ఏర్పాటుచేసి సంబరాలు చేసుకోవాలనేది అల్లు అర్జున్ ప్లాన్. పనిలోపనిగా అల వైకుంఠపురములో సినిమా పాటలతో తమన్ తో ఓ కన్సర్ట్ ఏర్పాటుచేయాలనేది ఆలోచన.

అయితే ఈ పార్టీ ఏ రేంజ్ లో జరుగుతుందనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఎందుకంటే, కరోనా కారణంగా చాలామంది నటీనటులు ఇలాంటి పార్టీలకు దూరంగా ఉంటున్నారు. పైగా మెగా కాంపౌండ్ లో చరణ్, వరుణ్ ఇద్దరూ ఒకేసారి కరోనా బారినపడ్డారు. ఈ నేపథ్యంలో పార్టీ ఏ మేరకు సక్సెస్ అవుతుందనేది చూడాలి.