రాకీ భాయ్ వచ్చేశాడు

kgf-2-teaser-review

దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న కేజీఎఫ్-2 సందడి మొదలైంది. యష్ హీరోగా నటిస్తున్న ఈ భారీ
బడ్జెట్ పాన్-ఇండియన్ మూవీకి సంబంధించి టీజర్ రిలీజైంది. అంచనాలకు ఏమాత్రం తీసిపోని విధంగా
అద్భుతంగా ఉంది టీజర్.

కేజీఎఫ్ చాప్టర్-1లో సన్నివేశాల్ని ముందుగా టచ్ చేస్తూ, ఆ తర్వాత మెల్లగా చాప్టర్-2ను టీజర్ లో
పరిచయం చేశారు. కేజీఎఫ్ చాప్టర్-1తో విజువల్ మాస్టర్ అనిపించుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్..
చాప్టర్-2 టీజర్ కూడా స్టన్నింగ్ విజువల్స్ చూపించాడు. నటీనటుల్ని పరిచయం చేస్తూనే… చివర్లో హీరో
యష్ ను అదిరిపోయే మాస్ లుక్ లో ప్రజెంట్ చేశాడు.

ఈ టీజర్ ను ఈరోజు ఉదయం రిలీజ్ చేయాలనేది ఒరిజినల్ ప్లాన్. కానీ ఊహించని విధంగా టీజర్ కు
సంబంధించిన కొన్ని స్టిల్స్ నిన్న సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. దీంతో తప్పనిసరి పరిస్థితుల మధ్య
నిన్న రాత్రే కేజీఎఫ్-2 టీజర్ ను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు మేకర్స్.