కృష్ణంరాజుకు తమిళనాడు గవర్నర్​ పదవి?

ప్రముఖ సినీనటుడు రెబల్​ స్టార్​ కృష్ణంరాజుకు కేంద్ర ప్రభుత్వం తమిళనాడు గవర్నర్​ పదవి ఇవ్వబోతుందని.. సోషల్​మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై భారతీయ జనతా పార్టీ గానీ.. ఇటు కేంద్ర ప్రభుత్వం గానీ క్లారిటీ ఇవ్వలేదు. మరోవైపు పలువురు బీజేపీ నేతలు కృష్ణంరాజుకు సోషల్​మీడియాలో అభినందనలు తెలుపుతున్నారు. అయితే వారికి బీజేపీ పెద్దల నుంచి అంతర్గతంగా సమాచారం అందిందా? లేక సోషల్​మీడియాలో జరుగుతున్న ప్రచారం ద్వారానే అభినందనలు తెలుపుతున్నారా అన్న విషయంపై అయితే క్లారిటీ లేదు. కృష్ణం రాజు గతంలో బీజేపీలో ఉన్నారు. కేంద్రమంత్రిగా కూడా పనిచేశారు.

కృష్ణంరాజుకు పదవి దక్కబోతుందని తెలిసి ఆయన అభిమానులు సంబరాలు మొదలుపెట్టారు. ప్రభాస్​, కృష్ణం రాజుకు సోషల్​ మీడియాలో అభినందనలు పోటెత్తుతున్నాయి. 1998లో ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. కాకినాడ పార్లమెంట్​ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. వివిధ కమిటీల్లో సభ్యుడిగా పనిచేశారు. 2000 సంవత్సరంలో కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

2009లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో చేరిన కృష్ణం రాజు.. అనంతరం కొన్నాళ్లు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. తర్వాత మళ్లీ బీజేపీలో చేరారు. బీజేపీ నేతలకు ఈ మధ్యకాలంలో గవర్నర్​ పదవులు దక్కుతున్నాయి. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ బీజేపీ సీనియర్​ నేత చెన్నమనేని విద్యాసాగర్​రావు మహారాష్ట్ర గవర్నర్​గా వెళ్లారు. బండారు దత్తాత్రేయ ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా వ్యవహరిస్తున్నారు.