లవ్ స్టోరీ టీజర్ రెడీ

love-story-nagachaitanya-sai-pallavi

దాదాపు ఏడాదిగా షూటింగ్ జరుపుకుంటున్న లవ్ స్టోరీ సినిమా ఎట్టకేలకు రెడీ అయింది. ఈ సినిమా ఫస్ట్
కాపీ రెడీ అయింది. దీంతో టీజర్ రిలీజ్ డేట్ ను ఎనౌన్స్ చేశారు. మరో 2 రోజుల్లో.. అంటే 10వ తేదీన
ఉదయం 10 గంటల 8 నిమిషాలకు రెడ్ టీజర్ రిలీజ్ చేయబోతున్నారు. ఈ మేరకు యూనిట్ నుంచి
అధికారిక ప్రకటన వచ్చేసింది.

టీజర్ ఎనౌన్స్ మెంట్ సందర్భంగా విడుదల చేసిన మూవీ స్టిల్, మరోసారి అందర్నీ ఆకట్టుకుంది. ఈ
పోస్టర్ లో నాగచైతన్య చెవిలో సాయి పల్లవి ఏదో చెబుతోంది. చూడముచ్చటగా ఉన్న ఈ పోస్టర్ ఇప్పుడు
సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

ఫిదా లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న సినిమా కావడం.. పైగా
నాగచైతన్య-సాయిపల్లవి లాంటి నటులు కలిసి నటిస్తున్న సినిమా కావడంతో లవ్ స్టోరీపై అంచనాలు
బాగా ఉన్నాయి. టీజర్ లో సినిమా విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉంది.