7 భాషల్లో వస్తున్న రెడ్

రామ్ నటించిన రెడ్ మూవీని 7 భాషల్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అలా అని ఇది
పాన్-ఇండియా మూవీ కాదు. పలు భాషా చిత్రం అంతకంటే కాదు. వివిధ మార్కెట్లలో రామ్ కు ఉన్న
ఇమేజ్, మార్కెట్ ను దృష్టిలో పెట్టుకొని రెడ్ సినిమాను వివిధ మాధ్యమాల్లో, 7 భాషల్లో విడుదల
చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

రెడ్ సినిమాను కన్నడం, మలయాళం, బెంగాలీ, భోజ్ పురి, మరాఠీ, తమిళంతో పాటు హిందీ లోకి కూడా
డబ్ చేశారు. కన్నడ వెర్షన్ ఈ నెల14 నే విడుదల కానుంది. మిగిలిన వెర్షన్ లను ఈ నెలాఖరున రిలీజ్
చేస్తారు. తమిళ వెర్షన్ ని మాత్రం డైరెక్ట్ గా ఓటిటి లో విడుదల చేస్తున్నారు.

కిషోర్ తిరుమల దర్శకత్వంలో రామ్ నటించిన ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు. మాళవిక
శర్మ, నివేత పెతురాజ్, అమృతా అయ్యర్ నటించారు. మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమాను
స్రవంతి రవికిషోర్ నిర్మించాడు. తన కెరీర్ లో రామ్ ఫస్ట్ టైమ్ డ్యూయల్ రోల్ చేసిన సినిమా ఇది. తమిళ్ లో హిట్టయిన తడమ్ సినిమాకు రీమేక్ ఇది.