హాట్ యాంకర్ కు కరోనా లక్షణాలు

anasuya-corona

ఓవైపు కరోనా కేసులు తగ్గుతున్నాయని ప్రభుత్వం ప్రకటిస్తుంటే, మరోవైపు టాలీవుడ్ లో ప్రముఖులు
మాత్రం వరుసగా కరోనా బారిన పడుతూనే ఉన్నారు. మొన్నటికిమొన్న రామ్ చరణ్, వరుణ్ తేజ్, రకుల్ ప్రీత్ లాంటి స్టార్స్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ లిస్ట్ లోకి అనసూయ కూడా చేరిపోయింది.

తనకు కూడా కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయని ప్రకటించింది అనసూయ. అయితే తనకు పాజిటివ్ వచ్చిన విషయాన్ని ఆమె నిర్థారించలేదు.

“ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు కర్నూలు వెళ్లాల్సి ఉంది. పొద్దున్నే లేచాను. కానీ నాలో కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో ప్రయాణాన్ని రద్దుచేసుకున్నాను. వీలైనంత త్వరగా వైద్య పరీక్షలు చేయించుకుంటాను. ఈమధ్య కాలంలో నాతో టచ్ లోకి వచ్చిన వాళ్లంతా విధిగా టెస్టు చేయించుకోండి. త్వరలోనే అన్ని అప్ డేట్స్ ఇస్తా.”

ఇలా తనకు కరోనా లక్షణాలు ఉన్న విషయాన్ని బయటపెట్టింది అనసూయ. ఈరోజు లేదా రేపు ఆమె కరోనా పరీక్ష చేయించుకుంటుంది.