సంక్రాంతి సినిమాల్లో ఇదే పెద్దది

master movie

ఈ సంక్రాంతికి 4 సినిమాలు పోటీపడుతున్న సంగతి తెలిసిందే. వీటిలో ఒక సినిమా క్రాక్ ఆల్రెడీ
థియేటర్లలోకి వచ్చేసింది. పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. మిగిలిన 3 సినిమాలు రెడ్, మాస్టర్, అల్లుడు
అదుర్స్ కూడా వరుసపెట్టి థియేటర్లలోకి రాబోతున్నాయి. మరి ఈ 4 సినిమాల్లో ఏది పెద్ద సినిమా.

రన్ టైమ్ పరంగా సంక్రాంతి సినిమాల్లో పెద్ద సినిమా మాస్టర్. విజయ్ హీరోగా నటించిన ఈ సినిమా ఏకంగా
3 గంటల నిడివి ఉంది. ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే దీని రన్ టైమ్ అక్షరాలా 2 గంటల 58 నిమిషాలు. ఇక క్రాక్ సినిమా 2 గంటల 34 నిమిషాలున్న సంగతి తెలిసిందే.

ఇక రిలీజ్ కు రెడీ అయిన మిగతా సినిమాల విషయానికొస్తే.. రామ్ హీరోగా నటిస్తున్న రెడ్ సినిమా 2
గంటల 26 నిమిషాలు ఉంది. అటు బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా నటించిన అల్లుడు అదుర్స్ సినిమా 2.29 నిమిషాలు ఉంది.

సో.. ఈ సంక్రాంతికి నిడివి పరంగా పెద్ద సినిమా మాస్టర్ మాత్రమే. బాక్సాఫీస్ లెక్కల పరంగా పెద్ద
సినిమాగా ఏది అవతరిస్తుందో తేలాల్సి ఉంది.