పెళ్లి చేసుకున్న సింగర్ సునీత

singer-sunitha-ram-marriage

టాలీవుడ్ సీనియర్ సింగర్ సునీత పెళ్లి చేసుకున్నారు. ఇండస్ట్రీ సర్కిల్ లో బాగా ఫేమస్ అయిన మ్యాంగో రామ్ ను ఆమె వివాహం చేసుకున్నారు. శంషాబాద్ సమీపంలో ఉన్న రామాలయంలో వీళ్ల పెళ్లి నిరాడంబరంగా జరిగింది. ఇటు సునీతకు, అటు రామ్ కు ఇది రెండో పెళ్లి

చాలా చిన్న వయసులోనే సునీతకు పెళ్లి చేశారు. ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. కానీ వాళ్ల వైవాహిక బంధం నిలవలేదు. దాదాపు దశాబ్దం కిందటే విడాకులు తీసుకున్నారు. అప్పట్నుంచి పిల్లల ఆలనాపాలన తనే చూసుకున్నారు. వాళ్లను చదివించి పెద్ద వాళ్లను చేశారు.

అటు రామ్ కూడా చాలా ఏళ్ల కిందటే తన భార్యకు విడాకులు ఇచ్చారు. ఈయన కూడా కొన్నేళ్లుగా సింగిల్ గా ఉంటున్నారు. అలా రామ్-సునీత కలిశారు. గతేడాది డిసెంబర్ లో వీళ్ల నిశ్చితార్థం సింపుల్ గా జరిగింది. ఇప్పుడు పెళ్లితో ఒకటయ్యారు.