వకీల్ సాబ్ షూటింగ్ మొత్తం పూర్తి

vakeel saab movie pawan-kalyan-plan-change

పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న వకీల్ సాబ్ సినిమా టోటల్ షూటింగ్ పూర్తిచేసుకుంది. 15 రోజుల కిందట
పవన్ కల్యాణ్ తన పోర్షన్ మొత్తం పూర్తిచేయగా.. తాజాగా నిర్వహించిన ఆఖరి షెడ్యూల్ లో మొత్తం
సినిమా కంప్లీట్ అయింది. చివరి షెడ్యూల్ నివేత థామస్ పై కొన్ని సన్నివేశాలు తీయడంతో పాటు..
మిగతా ప్యాచ్ వర్క్ కంప్లీట్ చేశారు.

వకీల్ సాబ్ షూటింగ్ మొత్తం పూర్తయిన విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం సినిమా
పోస్ట్ ప్రొడక్షన్ లో స్టేజ్ లో ఉందని చెబుతూనే.. సంక్రాంతి కానుకగా టీజర్ ను విడుదల చేయబోతున్న
విషయాన్ని మరోసారి గుర్తుచేశారు. ఈ సినిమా సమ్మర్ ఎట్రాక్షన్ గా థియేటర్లలోకి రాబోతోంది. విడుదల
తేదీని టీజర్ లో చెబుతారని సమాచారం.

పింక్ సినిమాకు రీమేక్ గా వస్తోంది వకీల్ సాబ్. కాకపోతే యాజ్ ఇటీజ్ గా తీసేయకుండా.. పవన్ కల్యాణ్
ఇమేజ్, స్టార్ డమ్ ను దృష్టిలో పెట్టుకొని కొన్ని కీలక మార్పులు చేశారు. పవన్ సరసన శృతిహాసన్
హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.