ఒక రోజు ముందే అల్లుడు అదుర్స్

Alludu Adhurs to release on January 14

అసలే కరోనా, థియేటర్లన్నీ 50 శాతం ఆక్యుపెన్సీతో వస్తున్నాయి. ఇలాంటి టైమ్ లో ఒకే రోజు 2 సినిమాలు రిలీజ్ చేయాలని ఏ ప్రేక్షకుడూ అనుకోడు. కానీ హీరో బెల్లంకొండ అనుకున్నాడు. అసలైన సంక్రాంతి రేసుకు తెరతీశాడు.

లెక్కప్రకారం.. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా నటించిన అల్లుడు అదుర్స్ సినిమా 15వ తేదీకి రావాలి. కానీ ఇప్పుడీ సినిమాను ఒక రోజు ముందే, అంటే 14వ తేదీకే విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు మేకర్స్. దీంతో పోటీ అనివార్యమైంది.

14వ తేదీకి రామ్ హీరోగా నటించిన రెడ్ సినిమా ఆల్రెడీ షెడ్యూల్ అయి ఉంది. ఆ తేదీకి వస్తున్నట్టు బెల్లంకొండ ప్రకటించడంతో పోటీ తప్పలేదు. 50శాతం ఆక్యుపెన్సీతోనే ఈ ఇద్దరు హీరోలు థియేటర్లు పంచుకోవాల్సిన పరిస్థితి.

బెల్లంకొండ చర్యపై పలువురు టాలీవుడ్ ప్రముఖులు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. ఇలాంటి టైమ్ లో పోటీ పెట్టుకోవడం సమంజసం కాదంటూ కొందరు ఫిలింఛాంబర్ లో ఫిర్యాదు కూడా ఇచ్చారు. కానీ బెల్లంకొండ మాత్రం తగ్గేలా లేడు.