సిస్టర్ గా మారిన లావణ్య త్రిపాఠి

బ్యూటీఫుల్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి సిస్టర్ గా మారింది. ఎవ్వరైనా ఆమెను సిస్టర్ అని పిలవాల్సిందే.
అవును.. హాస్పిటల్ లో సిస్టర్ పాత్ర పోషిస్తోంది ఆమె. ఆ పాత్ర పేరు సిస్టర్ మల్లిక. చావు కబురు చల్లగా
సినిమా మేటర్ ఇది.

డిఫరెంట్ స్టోరీ లైన్ తో వస్తోంది చావు కబురు చల్లగా మూవీ. కార్తికేయ-లావణ్య త్రిపాఠి హీరోహీరోయిన్లుగా
నటిస్తున్నారు. ఇందులో కార్తికేయ పాత్ర ఏంటనేది ఆల్రెడీ బయటకొచ్చింది. అతడి క్యారెక్టర్ పేరు బస్తీ
బాలరాజు. మార్చురీ బండి డ్రైవర్.

ఇప్పుడు తాజాగా లావణ్య త్రిపాఠి రోల్ ను రివీల్ చేశారు. హాస్పిటల్ లో సిస్టర్ గా లావణ్య త్రిపాఠి,
మార్చురీ వ్యాన్ డ్రైవర్ గా కార్తికేయ నటిస్తున్నారు. వీళ్లిద్దరి మధ్య ప్రేమ ఎలా పుట్టింది, కుటుంబాలు ఎలా
కలిశాయనే స్టోరీతో వస్తోంది చావుకబురు చల్లగా.

కౌశిక్ పెగళ్లపాటి దర్శకుడిగా పరిచయమౌతున్న ఈ సినిమాను జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాస్
నిర్మిస్తున్నాడు. సమ్మర్ ఎట్రాక్షన్ గా ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు.