తమిళ దర్శకుడితో రామ్ సినిమా

hero-ram-stills

రెడ్ మూవీ రిలీజ్ కు రెడీ అయింది. మరో 3 రోజుల్లో అది థియేటర్లలోకి రాబోతోంది. కానీ ఇప్పటివరకు తన తదుపతి చిత్రం ఏంటనేది వెల్లడించలేదు రామ్. దీంతో అతడి నెక్ట్స్ మూవీపై రోజుకో పుకారు
పుట్టుకొస్తోంది. ఈ క్రమంలో మరో రూమర్ రాజ్యమేలుతోంది.

ఆమధ్య త్రివిక్రమ్ దర్శకత్వంలో రామ్ ఓ సినిమా చేయబోతున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ ఆ వెంటనే
అది పుకారు అని తేలిపోయింది. ఇప్పుడు కొత్తగా లిస్ట్ లోకి ఆర్టీ నేసన్ వచ్చి చేరాడు. ఈ తమిళ
దర్శకుడు.. రామ్ తో ఓ డిఫరెంట్ యాక్షన్ సబ్జెక్ట్ ప్లాన్ చేస్తున్నాడట. ఇందులో నిజమెంతో తెలియాలంటే
ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే.

ఇంతకీ ఈ ఆర్టీ నేసన్ ఎవరో తెలుసా? కొన్నాళ్ల కిందట పవన్ కల్యాణ్ తో సినిమా చేయడానికి
ప్రయత్నించిన దర్శకుడు ఇతడే. ఆ సినిమాకు కొబ్బరికాయ కూడా కొట్టారు. కానీ అంతలోనే
ఆగిపోయింది. అలా పవన్ ను డైరక్ట్ చేసే అవకాశాన్ని పోగొట్టుకున్న ఈ దర్శకుడు, ఇప్పుడు రామ్ పై
దృష్టి పెట్టాడట.