కరోనా నుంచి కోలుకున్న మెగాహీరో

ఊహించని విధంగా రామ్ చరణ్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తనకు కరోనా సోకిన విషయాన్ని
డిసెంబర్ 29న రామ్ చరణ్ ప్రకటించాడు. అప్పట్నుంచి ఆయన హోమ్ ఐసోలేషన్ లోకి వెళ్లిపోయడు.
ఇంట్లోనే వైద్యుల బృందం నేతృత్వంలో చికిత్స తీసుకుంటున్నాడు.

ఇప్పుడు మెగాభిమానులకు గుడ్ న్యూస్ ఏంటంటే.. కరోనా వైరస్ నుంచి చరణ్ పూర్తిస్థాయిలో
కోలుకున్నాడట. కాకపోతే ఆ విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ప్రస్తుతం డాక్టర్లు చరణ్ కు
వివిధ రకాల టెస్టులు చేస్తున్నారు. ఆ ఫలితాలు కూడా సానుకూలంగా వచ్చిన తర్వాత.. అప్పుడు తన
హెల్త్ బులిటెన్ ను రిలీజ్ చేయబోతున్నాడు చరణ్.

ఇదిలా ఉండగా.. రామ్ చరణ్ కోలుకున్నాడనే విషయం అటు ఆర్ఆర్ఆర్ యూనిట్ కు, ఇటు ఆచార్య
యూనిట్ కు చేరవేశారు. ఈ రెండు సినిమాల్లో రామ్ చరణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆచార్య సెట్స్
పైకి ఆయన ఇంకా వెళ్లలేదు.