జీ తెలుగు చేతికి వకీల్ సాబ్

vakeel saab movie pawan-kalyan-plan-change

పవన్ కల్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమా శాటిలైట్ రైట్స్ ను జీ తెలుగు ఛానెల్ దక్కించుకుంది. తాజా సమాచారం ప్రకారం 15 కోట్ల రూపాయలకు ఈ సినిమా శాటిలైట్ డీల్ పూర్తయింది. త్వరలోనే ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించబోతున్నారు.

నిజానికి ఈ సినిమా శాటిలైట్ రైట్స్ డీల్ చాన్నాళ్ల కిందటే పూర్తయింది. జెమినీ ఛానెల్ ఈ సినిమా రైట్స్ కోసం దాదాపు 10 నెలల కిందటే కర్చీఫ్ వేసుకుంది. అగ్రిమెంట్ కూడా దాదాపు పూర్తయింది. సరిగ్గా సంతకాలు పెట్టే సమయానికి ఈ డీల్ నుంచి జెమినీ తప్పుకోవడం, జీ తెలుగు ఎంటరవ్వడం చకచకా జరిగిపోయాయి. జెమినీ ఆఫర్ చేసిన ఎమౌంట్ కంటే కోటి రూపాయలు ఎక్కువగా జీ తెలుగు ఆఫర్ చేయడంతో సినిమా ఇలా చేతులు మారినట్టు టాక్.

పవన్ కల్యాణ్, శృతిహాసన్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా టీజర్ ను రేపు సాయంత్రం 6 గంటలకు రిలీజ్ చేయబోతున్నారు. వేణుశ్రీరామ్ డైరక్టర్. తమన్ సంగీతం అందించాడు.