బంగారు బుల్లోడు రెడీ

Bangaru Bullodu to release on January 23

ఒకేసారి రెండు సినిమాలు రెడీ చేశాడు అల్లరి నరేశ్. నాంది సినిమా రీసెంట్ గా రెడీ అవ్వగా, లాక్ డౌన్ కు
ముందే బంగారు బుల్లోడు సినిమా విడుదలకు సిద్ధమైంది. ఇప్పుడీ రెండు సినిమాలు మినిమం గ్యాప్ లో
థియేటర్లలోకి రాబోతున్నాయి. వీటిలో ఒక సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. అదే బంగారు బుల్లోడు.

ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై గిరి దర్శకత్వంలో అల్లరి నరేష్ నటించిన ఈ సినిమాను జనవరి
23న రిలీజ్ చేయాలని నిర్ణయించారు. ఈమధ్య కాలంలో వరుసగా సీరియస్ సినిమాలు చేసిన అల్లరి
నరేష్, ఈ సినిమాతో మరోసారి కామెడీ పండించబోతున్నాడు.

ఊరిలో గోల్డ్ బిజినెస్ చేసే వ్యక్తి, ఓ ఘటన వల్ల ఎలా 2 కుటుంబాల మధ్య ఇరుక్కుపోయాడనేది ఈ
సినిమా స్టోరీ. టాలీవుడ్ లో ఉన్న కమెడియన్లంతా ఈ సినిమాలో నటించారు. సో.. కామెడీ గ్యారెంటీ
అంటున్నారు మేకర్స్. ఈ సినిమాలో పూజా ఝవేరి హీరోయిన్ గా నటించింది.